Thursday, May 26, 2022

రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే – ఎమ్మెల్యే సీతక్క

-మిర్చీ పంటలను పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

-మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

-ఎకరాకు 50 వేల నష్ట పరిహారం చెల్లించాలి

-రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే సీతక్క

మంగపేట,జనవరి16(ప్రజా జ్యోతి):ఏటూరు నాగారం మండలం రామన్న గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అకాల వర్షాలతో, తెగులతో ఉన్న మిర్చి పంటలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాల వలన గులాబీ తెగులు సోకి సుమారు రెండు వేల ఎకరాలలో మిర్చి పంట దెబ్బ తిన్న పరిస్థితి ఉందని ఒక ఎకరానా లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి, మిర్చి రైతులంతా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళకి ప్రభుత్వం భరోసా కల్పించి రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రైతుల వద్దకు వెళ్లి కనీసం ఆత్మధైర్యం కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, టిఆర్ఎస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు, మిర్చి రైతు మిర్చితోటలో, పురుగుల మందు లు తాగి రైతులు చనిపోతుంటే ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు రైతుబంధు సంబరాలు చేసుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారు రైతులు సంతోషంగా లేరు, మిర్చి పంటలు పోయి, వరి పంట పండిస్తే సకాలంలో కొనక, రైతులను తరుగు పేరుతో ఒక బస్తా మూడు నుండి నాలుగు కిలోలు, ఒక క్వింటాలుకు 10 నుండి 12 కిలోల కోత విధిస్తూ మిలర్లతో ప్రభుత్వం కుమ్మకై, రైతులను నట్టేట ముంచిన ముఖ్య మంత్రి గారు ఇది రైతు ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం రైతుల రక్తం తాగే ప్రభుత్వం ఈ సందర్భంగా అన్నారు,వందల ఎకరాలు ఉన్న నాయకులకు లక్షలలో కోట్లలో రైతుబంధు డబ్బులు పడితే, వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఈ రోజు రైతుల సంబరాలు అంటున్నారు, దీన్ని తెలంగాణ రైతాంగం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాంఅని ఆమె అన్నారు. మీరు రైతు సంబరాలు బంద్ చేసి రైతు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి పరిశీలించి రైతులకు ఆత్మస్థయిర్యాన్ని, ధైర్యాన్ని కల్పించి, ప్రభుత్వం తరఫున మిర్చి రైతులకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయుబ్ ఖాన్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,జెడ్పీటీసీ నామ కరం చంద్ గాంధీ,మండల అధ్యక్షుడు చిట మట రఘు ఎండీ చాంద్ పాషా,ఎండీ అప్సరు పాషా,మైల జయరాం రెడ్డి,మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీవావిలాల నర్సింహా రావు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,సీనియర్ నాయకులు ఎండీ ఖలీల్ ఖాన్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీధర్,ముక్కెర లాలయ్య, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్ బాబు జిల్లా యూత్ కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు ఉపాధ్యక్షుడు తుడి భగవాన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి లు అయ్యేరి యన్నయ్య కొంకతి సాంబశివరావు ఎస్టీ సెల్ మండల్ అధ్యక్షుడు చదా మల్లన్న బీసీ సెల్ మండల్ అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ మైనార్టీ సెల్ మండల్ అధ్యక్షుడు హిధైతుల కిసాన్ సెల్ మండల్ అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు మండల్ అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్దబతుల జగదీష్ సీనియర్ నాయకులు నర్రా కిషోర్ కొమరం బలన్న సారయ్య చిన్నపల్లి స్వామి దిగ్గోడ కాంతారావు ఆకుతోట అశోక్ బందారి వెంకన్న చింత పున్నారవు యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గద్దల నవీన్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చెల వినయ్,సహకార సంఘం వైస్ చైర్మన్ చేన్నురి బాలరాజు,సహకార సంఘం డైరెక్టర్ వంగ పండ్ల రవి,సర్దార్,హన్మంతు,సీనియర్ నాయకులు వీసాం వీరయ్య,లక్ష్మయ్య, ముత్తేశ్,ఎండీ జీయా,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles