Thursday, May 26, 2022

రాజ‌ద్రోహం సెక్ష‌న్ ల‌పై కేసుల‌కు బ్రేక్ – సెంట‌ర్ కు సుప్రీం షాక్..

న్యూఢిల్లీః రాజ‌ద్రోహం సెక్ష‌న్ లపై న‌మోద‌వుతున్న కేసుల‌పై విచార‌న జ‌రిపిన సుప్రీం కోర్టు నేడు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.. రాజ‌ద్రోహం కేసుల న‌మోదు బాధ్య‌త ఎస్పీ స్థాయి అధికారికి అప్ప‌చెబుతామ‌ని, ఈ సెక్ష‌న్ ను హోల్డ్ లో ఉంచ‌వ‌ద్ద‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా నేడు జ‌రిగిన వాద‌న‌లో సుప్రీం కోర్టును అభ్య‌ర్ధించారు..ఈ సెక్ష‌న్ లను స‌మీక్షించేందుకు కేంద్ర కృత‌నిశ్చ‌యంతో ఉంద‌ని, అయితే కొంత స‌మ‌యం అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు.. దేశ‌ద్రోహ చ‌ట్టం కింద సుమారు 13వేల మంది జైలులో ఉన్న‌ట్లు క‌పిల్ సిబ‌ల్ తెలిపారు. ఇందులో అధిక కేసులు ఆ సెక్ష‌న్ ల‌తో సంబంధం లేనినంటూ ప‌లు కేసుల‌ను క‌పిల్ సిబ‌ల్ ప్ర‌స్తావించారు.. అధికారంలో ఉన్న వారిని ట్విట్ట‌ర్ ద్వారా విమ‌ర్శించినా , హ‌నుమ చాలీసీ ప‌ఠిస్తామ‌న్న‌, రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేసినా రాజ‌ద్రోహం సెక్ష‌న్ ల‌తో ప‌లు రాష్ర్టాల‌లో ఆయా వ్య‌క్తుల‌పై కేసులు న‌మోదవుతున్నాయ‌ని, ఈ సెక్ష‌న్ ను ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు దుర్వినియోగం చేస్తున్నారంటూ క‌పిల్ సిబాల్ త‌న వాద‌న‌లో ప్ర‌స్తావించారు.. వాద‌న‌లు విన్న ధ‌ర్మాసనం జులై వ‌ర‌కూ ఈ సెక్ష‌న్ ల‌పై ఎవ‌రి మీద కేసులు న‌మోదు చేయ‌వ‌ద్ద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల విష‌యంలోనూ ముందుకు వెళ్ల‌వ‌ద్దంటూ సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది..అలాగే దేశ‌ద్రోహ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు బెయిల్ కోసం కోర్టును ఆశ్ర‌యించ‌వ‌చ్చు అని సుప్రీం తెలిపింది. దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని నిలిపివేయాల‌ని సీజే ఎన్వీ ర‌మ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేయ‌వ‌ద్దు అని ఆయ‌న ఆదేశించారు. ఐపీసీ 124ఏ కింద ప్ర‌స్తుతం కేసులు ఏవీ న‌మోదు చేయ‌వ‌ద్దు అని ఆయ‌న త‌న తీర్పులో తెలిపారు. దేశ‌ద్రోహ చ‌ట్టాన్ని రివ్యూ చేస్తామ‌ని కేంద్రం చెప్పింద‌ని, ఆ ప్ర‌క్రియ పూర్తి అయ్యే వ‌ర‌కు 124ఏ కింద కేసులు బుక్ చేయ‌వ‌ద్దు అని కోర్టు తెలిపింది. కాగా,
ప్రజాస్వామ్యంలో నియంతలుగా మారుతున్న నేతలకు ప్రజలు కళ్లెం వేయలేకపోతున్నారు. తమకున్న ఓటును అమ్ముకోవడంతో వారు నియంతలుగా మారుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని విర్రవీగుతున్నారు. తమకు ఎదురులేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తున్నాయి. నియంతల కోరలు పీకే పనిలో ముందుంటున్నాయి. అలాంటిదే 124 ఎ సెక్షన్‌ తొలగింపు. రాజద్రోహం సెక్షన్‌ను కొనసాగించే విషయంపై పునరాలోచిస్తున్నామని, అందుకు తమకు సమయం కావాలని కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈలోపు రాజద్రోహం సెక్షన్‌ 124(ఏ) కింద కొత్త కేసులేవీ పెట్టకూడదనే సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. అలాగే… ఇప్పటికే ఈ సెక్షన్‌ కింద అరెస్టయిన వారి హక్కులను కాపాడేందుకు మార్గదర్శక సూత్రాలను రూపొందిం చే విషయాన్ని కూడా పరిశీలించాలని పేర్కొంది. రాజద్రోహానికి సంబంధించి పెండింగ్‌ కేసులు, భవిష్యత్‌ లో పెట్టబోయే కేసుల విషయంలో ఏం చేస్తారో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించారు. 2014-19 మధ్య రాజద్రోహం సెక్షన్‌ కింద దేశవ్యాప్తంగా 326 కేసులు నవెూదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 6 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. ఇపðడు ఈ సెక్షన్‌ను ఉపసంహరించుకునే క్రమంలో దీనికింద శిక్షకు గురైనవారిని ఏ విధంగా రక్షిస్తార న్నది కూడా ముఖ్యం.సెక్షన్‌ 124ఏను తీవ్రంగా ఆక్షేపించిన ప్రథమప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం లోనే ఈ సెక్షన్‌ దుర్వినియోగం కావడం గమనార్హం. కాలం గడిచేకొద్దీ ఆ సెక్షన్‌ను దుర్విని యోగం చేయడం పెరిగిపోయింది. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమను విమర్శించే వారిపై కేసులు పెట్టడం ఫ్యాషన్‌గా మారింది. ప్రజాస్వామ్యంలో నియంతలు అధికారంలోకి వచ్చినపðడల్లా సెక్షన్‌ 124 ఏ మరింతగా దుర్వినియోగం అవుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి ఆరాధన చొరబడినపðడు అది నియంతృత్వ పాలనకు దారితీస్తుందని అంబేద్కర్‌ ఎపðడో హెచ్చరించారు. ఇందిరాగాంధీ హయాంలో వ్యక్తిపూజ పరాకాష్ఠకు చేరింది. ఫలితంగా దేశ ప్రజలు ఎమర్జెన్సీ చీకటి రోజులను అనుభవించారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు కేంద్రంలో మళ్లీ వ్యక్తి ఆరాధన పెరిగిపోయింది. భారతీయ జనతా పార్టీని ప్రధాని నరేంద్ర వెూదీ తనజేబు సంస్థగా మార్చేసుకున్నారు. ఆయన చెప్పినట్లుగానే ఇపðడు పార్టీ, ప్రభుత్వం నడుస్తోంది. అధికారాలన్నీ వెూదీ వద్ద కేంద్రీకృతం కావడంతో మంత్రులు డవ్మిూగా మారిపోయారు. తెలుగు రాష్టాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తమను తాము నియంతలుగా భావించుకుంటున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ తమ మనసులో ఏమనుకుంటే అదే ప్రభుత్వ నిర్ణయం అయిపోతోంది. మంత్రులు, ఇతర వ్యవస్థలు నిమిత్తమాత్రంగా మిగిలిపోతున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ వ్యవహారాం కూడా ఇలాగే ఉంది. తాము గెలిచాం కనుక చెప్పిదే వేదం..చేసిందే చట్టం అన్న రీతిలో ప్రాంతీయ పార్టీల నేతలు నడుచుకుంటున్నారు. వారిని కాలదన్నేలా వెూడీ కూడా అంతకుమించి అన్న రీతిలో ఉన్నారు. ప్రజలు తమకు అధికారం అప్పగించారు కనుక తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుం దని ప్రధాని వెూడీ సహా కేసీఆర్‌, జగన్‌ మమతా బెనర్జీలు నమ్ముతున్నారు. తమ నిర్ణయాలను, విధానాలను విమర్శించే వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ఎపి సిఎం జగన్‌కు సాటి వచ్చే వారు లేరు. రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు వల్ల బెయిలు విూద విడుదలై తాను ముఖ్యమంత్రి కాగలిగానన్న విషయాన్ని విస్మరించి అనేక నియంతృత్వ పోకడలకు నాంది పలికారు. న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. ఇద్దరు తెలుగు వల్లభులు పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని తమను విమర్శించే వారిని కేసుల్లో ఇరికిస్తున్నారు. ప్రత్యర్థులను జైలుకు పంపడానికి వెనకాడడం లేదు. తాజాగా సుప్రీం ఆదేశాలతో కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం ఉంది. అమాయకులపై కేసులు పెట్టి వేధించే విధానానికి ముగింపు వస్తుందని ఆశిస్తున్నాం. రాజద్రోహం కేసులతో ఇక వేధించే చర్యలకు చరమగీతం పాడేలా సుప్రీం కూడా గట్టిగానే ఉంది. నిరంకుశ పోకడలకు ఎవరో ఒకరు ఎపðడో ఒకపðడు బ్రేక వేస్తారు. 124 ఎ ప్రకారం ప్రభుత్వాల అరాచకాలకు, వాటికి వత్తాసు పలుకుతున్న అధికారులకు బ్రేకులు పడే సమయం ఆసన్నమైంది. ప్రజలు అధికారం ఇచ్చేది ఇష్టారాజ్యంగా వ్యవహరిం చడానికి కాదని ప్రభుత్వా లను నడుపుతున్న పార్టీల నేతలు గుర్తిస్తారని ఆశిద్దాం. తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ రెడ్డి,మమతా బెనర్జీలు ఇప్పటికే ప్రజల్లో పలుచనైపోయారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదిరించడం కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని చెప్పి వివిధ రాష్టాలు తిరిగి వచ్చిన కేసీఆర్‌ ఇలాగే నియంతృత్వ ధోరణలు, కుటుంబ పాలనకు ప్రాధాన్యం ఇస్తే ప్రజలు అంగీకరిం చరని గుర్తించాలి. కుయుక్తులతో, రాజకీయ వ్యూహాలతో రాజ్యాలు ఏలడం మానాలి. ప్రజలకు ఏది అవసరవెూ అది చేయాలి. ప్రజలు ఆందోళన చేయడం అన్నది వారి హక్కు. సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయడం కూడా హక్కుగా గుర్తించాలి. పాలనాపగ్గాలు చేపట్టింది ప్రజలను అణచివేయడానికి కాదని పాలకులు గుర్తించాలి. అణచివేత హద్దులు విూరినపðడు ప్రతిఘటన తప్పదు. శ్రీలంకలో జరుగుతున్నది అదే. రేపు మనదగ్గరా జరుగుతుంది. అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని సొంత ఆస్తిలాగా కరిగించి వేస్తున్న నేతలు ఉన్నంత కాలం దేశం బాగుపడదు. ఎంతటి బలమైన నాయకుడికైనా పరిస్థితులు ఎపðడూ అనుకూలంగా ఉండవు. చట్టాలు, నిబంధనలతో నిమిత్తం లేకుండా పైనుంచి వచ్చే ఆదేశాలను శిరసావ హిస్తూ కేసులు పెడుతున్న పోలీసు అధికారులు సైతం ఆలోచన చేయాలి. అణచివేతతో ముందుకు సాగితే కోర్టులు రంగంలోకి దిగకతప్పని పరిస్థితులు వస్తాయి. ఎడాపెడా రాజద్రోహం కేసులు పెట్టడం ఇకపై చెల్లదన్న రీతిలో దేశ సర్వోన్నత న్యాయస్థానం కొరడా పట్టుకుని సిద్దంగా ఉంది. సెక్షన్‌ 124ఏను వివిధ ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. సుప్రీం తాజా నిర్ణయంతో ప్రభుత్వాలకు ముకుతాడు వేసినట్టయింది. చరిత్రాత్మకమైన ఈ ఆదేశాలను జారీ చేసిన న్యాయమూర్తులు చిరస్థాయిగా నిలచిపోతారు. రాజ్యాంగాన్ని ఆవెూదించుకుని దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న 1950లోనే ఈ సెక్షన్‌ కింద కేసులు పెట్టడం విశేషం. వలసవాద ప్రభుత్వం పోయినా నయా వలసవాదులు ఇక మితివిూరి వ్యవహరించ కుండా సుప్రీం గట్టిగా నిలబడడం భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం కాబోతున్నది.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles