Thursday, May 26, 2022

మ‌హేష్ షో – “స‌ర్కారు వారి పాట” మూవీ రివ్యూ…

నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట గోపి ఆచంట
నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు
దర్శకత్వం : పరశురాం పెట్ల
విడుదల తేదీ : మే 12, 2022
రన్నింగ్ టైమ్: 160 నిమిషాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు ,, కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట . సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు రెండేళ్ల విరామం త‌ర్వాత గీత గోవిందం దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో రూపొందిన మూవీ స‌ర్కారు వారి పాట‌..ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో నేడు విడుద‌లైంది.. మ‌రి అంచనాల‌ను అందుకుందో లేదో చూద్దాం..

క‌థ‌
చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన మ‌హేష్ బాబు బాగా చదువుకుని అమెరికాలో స్థిరపడతాడు. తానెంతో కష్టపడి సంపాదించిన డబ్బును అమెరికాలో ఉన్నవాళ్లకు అప్పులిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఆ సమయంలో చదువుకోవటానికి ఇండియానుండి అమెరికాకి వచ్చిన క‌ళావ‌తి – కీర్తీ సురేష్ కి కూడా అప్పిస్తాడు మహేశ్‌. అలా వాళ్లిద్దరి పరిచయం అప్పుతో మొదలై ప్రేమ‌గా రూపాంత‌రం చెందుతుంది… ఈ క్ర‌మంలోనే తాను అప్పించిన వాళ్లు డ‌బ్బు క‌ట్ట‌కుండా ఇండియాకు పారిపోవ‌డంతో వాళ్ల‌ను వెతుక్కుంటూ భార‌త్ కు వ‌స్తాడు మ‌హేష్… అక్క‌డే క‌ళావ‌తి తండ్రి రాజేంద్ర‌నాథ్ – స‌ముద్ర‌ఖ‌నిని క‌లుస్తాడు… త‌నకు 10వేల కోట్లు భాకీ ఉన్నావ‌ని, అది వెంట‌నే క‌ట్ట‌మ‌ని రాజేంద్ర‌నాథ్ ను డిమాండ్ చేస్తాడు మ‌హేష్.. ఇక్క‌డే క‌థ మ‌లుపు తిరుగుతుంది.. రాజేంద్ర‌నాథ్ అంత డ‌బ్బు ఎందుకు తీసుకున్నాడు…క‌ళావ‌తి, మ‌హేష్ ల ప్రేమ క‌థ ఏమైంది..ఇండియాకి వ‌చ్చిన మ‌హేష్ అప్పులోళ్ల వ‌ద్ద ఎదురైన అనుభ‌వాలేమిటి తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌..
కేవలం లక్ష రూపాయల అప్పు కట్టలేక సూసైడ్‌లు చేసుకుంటున్నఈ దేశంలో కోటనుకోట్ల అప్పులు చేసి దర్జాగా పారిపోతుంటే వ్యవస్థ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? లోపం ఎక్కడ ఉంది? ఈ లోపాన్ని ఎవరు సరిదిద్దాలి? అనే ఇంట్రస్టింగ్‌ పాయింట్‌తో సినిమా క‌థను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్… దానికో అంద‌మైన ల‌వ్ ట్రాక్ ను జోడించాడు.. ఆపై మ‌హేష్ స్టైల్ క్యామెడీ సీన్స్ కు ప్రాణం పోశాడు…ముఖ్యంగా క్యామిడీ టైమింగ్ అదిరిపోయింది.. అలాగే ల‌వ్ ట్రాక్ సీన్స్ కూడా.. రెండు గంట‌ల 40 నిమిషాల సినిమా మొత్తం మ‌హేష్ చుట్టు తిరుగుతూనే ఉంటుంది.. ఈ సినిమా మొత్తాన్ని మ‌హేష్ త‌న భుజాల‌పై వేసుకుని మోసేశాడు..ల‌వ్ సీన్ల లో,పంచ్ డైలాగ్ ల‌లో, పైటింగ్ సీన్ ల‌లో త‌న‌దైన మార్క్ ను పండించాడు మ‌హేష్.. ఇక కీర్తీ సురేష్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు తాను రెడీ అంటూ ఇందులో గ్లామ‌ర్ షో చేసింది.. అదే స‌మ‌యంలో త‌న న‌ట‌న‌తోనూ అక‌ట్టుకుంది.. అయితే ముద్దుగా, బొద్దుగా చ‌క్క‌గా ఉండే కీర్తీ గ్లామ‌ర్ పాత్ర కోసం మ‌రీ పీల‌గా త‌యార‌వ‌డ‌మే కాస్త ఇబ్బంది క‌రం.. ఇక వెన్నెల కిషోర్, స‌ముద్ర ఖ‌ని, న‌దియాలు ప్రాతోచితంగా న‌టించారు.. మధు సినిమాటోగ్ర‌ఫితో ఆక‌ట్టుకున్నాడు.. థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రెండు సాంగ్స్ హిట్… సినిమాకు అనుగుణంగా బిజి ఇచ్చాడు..నిర్మాణ విలువ‌లు భారీగానే ఉన్నాయి.. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు, క్యామెడీ సీన్స్ నిండా ఉన్న ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అవ‌కాశాలున్నాయి…

Related Articles

- Advertisement -spot_img

Latest Articles