నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని నిరసన సీఐటీయూ

Submitted by Sathish Kammampati on Mon, 03/10/2022 - 14:26
Protest to reduce prices of essential commodities  CITU

 నల్లగొండ అక్టోబర్ 03(ప్రజాజ్యోతి)./... పెరుగుతున్న నిత్యవసరం వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం ఆరోపించారు.సోమవారం అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ యాక్షన్ డే నిరసన పిలుపు మేరకు  హమాలి ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ దేశంలో ధరలు, అవినీతి, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని వీటిని అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్పు చేస్తూ కార్మికులను కట్టుబానిసలుగా చేయడానికి కుట్ర జరుగుతుందని అన్నారు. కార్మిక వర్గ వేతనాలు, పెన్షన్ పెంపు ,ఉద్యోగ భద్రత, సరళీకృత ఆర్థిక విధానాల దుష్ప్రభావాలు, ఆరోగ్య సంరక్షణ ఒంటి ముఖ్యమైన సమస్యలపై ప్రపంచంలో ఏ దేశంలో సమ్మెలు, ఉద్యమాలు జరిగినా సంఘీభావం తెలపడానికి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఏర్పడిందని అన్నారు. దేశంలో గత 8 ఏళ్లుగా నరేంద్ర మోడీ సర్కార్ ద్రవయోల్బణం పెంచి, అధిక ధరలు నియంత్రించకుండా కార్మిక వర్గంపై భారం మోపడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, అమాలి యూనియన్ అధ్యక్షులు ఆవురేష్ మారయ్య, కార్యదర్శి కాడింగ్ రవి, మేడబోయిన వీరయ్య, నాగరాజు, వెంకన్న, అశోక్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.