తిప్పనపల్లి లో పేకాటరాయుల్ల అరెస్ట్

Submitted by veerabhadram on Sat, 01/10/2022 - 17:36
pekata rayulla arest

 ప్రజా జ్యోతి అక్టోబర్ 1 చండ్రుగొండ :

 చండ్రుగొండ మండలం తిప్పనపల్లి డంపింగ్ షెడ్లో పేకాట ఆడుతున్నాడు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై విజయలక్ష్మి తెలిపారు. శనివారం తిప్పనపల్లి గ్రామ శివారులో డంపింగ్ షెడ్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు పోలీసులు దాడులు చేయగా, నలుగురు వ్యక్తులతో పాటు 3 సెల్ ఫోన్స్, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్నట్లు ఆమె తెలిపారు. గ్రామాల్లో పేకాడుతున్నట్లు  తెలిస్తే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచటం జరుగుతుందని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.