Thursday, May 26, 2022

కోటి ఎకరాల మాగాణమే తెలంగాణ లక్ష్యం – మంత్రి వేముల ప్రశాంతరెడ్డి

కెసిఆర్‌ నిరంతర శ్రమతో నిరంతర విద్యుత్‌
విపక్షాలు విమర్శలు మాని నిజాలు గమనించాలి: వేముల
నిజామాబాద్‌,జనవరి13 : తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. కోటి ఎకరాల మాగాణి తెలంగాణ లక్ష్యంగా సిఎం కెసిఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్తు అందిస్తామని ఇచ్చిన హావిూని నిలుపుకున్నామని అన్నారు. కాళేశ్వర్‌ నీటిని తెస్తున్నామన్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి విూదుగా మిడ్‌ మానేరుకు నీరు వస్తుందని, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌ వరకు నీరు తేవడానికి పనులు కొనసాగుతు న్నాయన్నారు. మిడ్‌ మానేరు నుంచి మల్లన్నసాగర్‌ 42 కి.విూ.ల దూరం ఉండగా అందులో 33 కి.విూ.ల దూరాన్ని రూ. 10 వేల కోట్లు వెచ్చింది సొరంగం తవ్వకం చేపడుతున్నా మన్నారు. మల్లన్నసాగర్‌ నుంచి నల్గొండ, నిజాంసాగర్‌, కామారెడ్డి ప్రాంతాలకు సాగునీటిని అందిస్తామ న్నారు. రూ. 40 వేల కోట్లతో మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగు నీరు సరఫరా చేస్తామన్నారు. విద్యుత్‌ ఉత్పాదనరంగంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడేళ్లలో 25 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని సాధించి మిగులు విద్యుత్‌ ఉత్పత్తి రాష్ట్రంగా మార్చాలనే సంకల్పంతో కృషిచేస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన విధంగా రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన వేగంగా జరుగుతోందన్నారు. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులకు
కరెంటు సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇతర రాష్టాల నుంచి కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ స్వీయ పర్యవేక్షణ వల్ల కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌, సింగరేణి జైపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లు త్వరితగతిన పూర్తి చేసుకొని ఉత్పత్తి చేసుకోగలి గామని అన్నారు. రైతులకు కూడా 24గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ఏకైక లక్ష్యమన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు చేస్తోన్న తపðడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. వాస్తవ అభివృద్ధిని చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెట్టారని, దీని వల్ల రైతులు, అన్ని వర్గాల వినియోగదారులు సంతోషంగా ఉన్నారన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles