హైదరాబాద్ – కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణాలో ప్రవేశించింది.. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలోనే ఈ రెండు కేసులు నమోదు అయ్యాయి.. ఒకరు కెన్యా నుంచి,మరొకరు సోమాలియా నుంచి వచ్చారని.. ఆ ఇద్దరు వ్యక్తుల కుటుంసభ్యులను కూడా ఐసోలేషన్‌కు తరలించామని వెల్లడించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. జీవోమ్ స్వీక్వెన్సింగ్లో నిర్ధారణ అయిందని తెలిపారు. 12న కెన్యా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమైక్రాన్ ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. టోలిచౌకిలో యువతి ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇంట్లోని వారిని ఐసోలేషన్‌కు తరలించారని అధికారులు తెలిపారు. యువతికి ప్రస్తుతం టిమ్స్‌లో చికిత్స అందిస్తున్నామని డీహెచ్ చెప్పారు. నగరంలో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు అవడంతో అన్నిజిల్లాల వైద్యాధికారులను తెలంగాణ సర్కార్ అప్రమత్తం చేసింది.