Thursday, May 26, 2022

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

ఇబ్రహీంపట్నం,అక్టోబర్25(ప్రజా జ్యోతి): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1996~1997వ సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్ధండి గ్రామ గోదావరి నది వద్ద జరిగింది. ఈ సమ్మేళన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అందరూ చేరుకొని కలిసికట్టుగా వారు చదువుకున్న నాటి గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. వారి వారి జీవితంలో జరుగుతున్న తమ కష్టసుఖాలను తమ పూర్వ విద్యార్థులతో కలిసి పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి దూర ప్రాంతాల నుండి రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఒక్కరికి ఒక్కరు ఆలింగనం చేసుకుని తమ కష్టసుఖాలతో పాటు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles