చిత్తూరు,మే11 నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు,మాజీ మంత్రి నారాయణకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో మేజిస్టేట్ సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్లో అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం నారాయణను మేజిస్టేట్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. రూ.లక్ష చొపðన ఇద్దరు వ్యక్తులు జావిూను ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా నారాయణకు బెయిల్ మంజూరుని హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఎపి రాజకీయ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు..