Monday, January 17, 2022

రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం

బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థాల గుర్తింపు
న్యూఢిల్లీ,జనవరి14 : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేపింది. ఎపðడూ రద్దీతో ఉండే ఘాజీపూర్‌ పూల మార్కెట్‌ సవిూపంలో పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో ఓ బ్యాగు కనిపించగా.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం వారు బాంబు స్క్యాడ్‌కు సమాచారమిచ్చారు. అనంతరం బాంబు స్క్వాడ్‌ సిబ్బంది దాన్ని పరిశీలించగా అందులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్లు నిర్దారించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా.. ఘాజీపూర్‌ మార్కెట్‌ సవిూపంలోనే బాంబును కనుగొనడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ ఆస్థానా తెలిపారు. ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాంబును నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ సహాయంతో బాంబును నిర్వీర్యం చేశారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles