చివరి ఆయకట్టు రైతుల నీటి సమస్యను పరిష్కరిస్తాం -ఎన్నెస్పి ఈఈ కరుణాకర్,ఎంపీపీ

Submitted by venkat reddy on Fri, 30/09/2022 - 11:31
 The last Ayakattu will solve the farmers' water problem -NNSP EE Karunakar, MPP

-రాజవరం మేజర్ కాలువలను పరిశీలించిన ఎన్నెస్పి ఈఈ కరుణాకర్,ఎంపీపీఆంగోతు భగవాన్ నాయక్
ఫోటో రైటప్ ః మేజర్ కాలువ ను పరిశీలించిన ఎన్నెస్పి ఈఈ కరుణాకర్,ఎంపీపీఆంగోతు భగవాన్ నాయక్

తిరుమలగిరి(సాగర్),సెప్టెంబర్29(ప్రజాజ్యోతి) ః  చివరి ఆయకట్టు రైతుల నీటి సమస్యను పరిష్కరిస్తామని ఎన్నెస్పి ఈఈ కరుణాకర్,ఎంపీపీఆంగోతు భగవాన్ నాయక్ లు అన్నారు.గురువారం రాజవరం మేజర్ కాలువలను ఇరిగేషన్ డివిజన్ 2 పరిధిలోని కాలువ లను ఎన్నెస్పి ఈఈ కరుణాకర్,తిరుమలగిరి (సాగర్) ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్ తో కలిసి  పరిశీలించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతు కాలువలోని నాచు,తూములు,షట్టర్లను, కాలువలకు పడిన గండ్ల మరమ్మత్తులు చేసేందుకు ముందస్తుగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.అదేవిధంగా రాజవరం మేజర్ చివరి ఆయకట్టు రైతుల పొలాలకు నీరు అందకపోవడంతో రైతులు పడుతున్న కష్టాలను ఈఈ కరుణాకర్ కి ఎంపిపి ఆంగోతు భగవాన్ నాయక్ వివరించారు.అదేవిధంగా చివరి ఆయకట్టు రైతులకు నీటి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఆయన వెంట డిఈ సీతారాం, ఇరిగేషన్ సబ్ డివిజన్ వన్ ఏఈఈ వేణుగోపాల్,శ్రావణ్ కుమార్,రవి,వర్క్ ఇన్ స్పెక్టర్ సిరుపుద్దీన్,ఫీల్డ్ స్టాప్ రైతులు బుర్రి రామిరెడ్డి,  మంగ్తానాయక్,తదితరులు  పాల్గొన్నారు.