హైదరాబాద్ – పంజాబ్ కింగ్స్‌తో గత సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో ఉగ్రరూపం ప్రదర్శించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ట్విటర్ వేదికగా కశ్మీరి యంగ్ గన్ను ఆకాశానికెత్తాడు. భీకరమైన పేస్‌తో కూడిన నమ్మశక్యం కాని స్పెల్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఓవర్.. టేక్ ఎ బౌ యంగ్ మ్యాన్ అంటూ అభినందనలతో ముంచెత్తాడు. ఇందుకు ఉమ్రాన్ ఆఖరి ఓవర్ గణాంకాలకు సంబంధించిన ఫోటోను జోడించి ట్విటర్లో షేర్ చేశాడు. మంత్రి కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ వైరలవుతోంది. కాగా, ఉమ్రాన్ మాలిక్ మ్యాచ్ 20 ఓవర్ ను మెయిడిన్ గా వేయడమే కాకుండా మూడు వికెట్లు పడగొట్టాడు..ఈ జాబితాలో అతడి కంటే ముందు 2008లో ఇర్ఫాన్ పఠాన్, 2009లో లసిత్ మలింగ, 2017లో జయదేవ్ ఉనద్కత్ ఈ ఘనత సాధించారు. ఇది ఇలా ఉంటే మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ ఎంపి శశీ ధరూర్ కూడా ఉమ్రాన్ మాలిక్ ఫేస్ బౌలింగ్ ను ప్రశంసించారు.. అతడిని వెంటనే టీమ్ ఇండియా జట్టులోకి తీసుకోవాలని ట్విట్ చేశాడు
What an unbelievable spell full of raw pace #UmranMalik 🔥👏
Take a bow young man 👍 By far probably the best ever over in IPL pic.twitter.com/nxZdBQyOVv
— KTR (@KTRTRS) April 17, 2022