జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ. 20,016
వరంగల్ జిల్లా ఖానాపురం :14 జనవరి (ప్రజా జ్యోతి)ఖానాపురం మండలం లోని అశోక్ నగర్ గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను గ్రామ సర్పంచి గొర్రె కవిత రవితో కలిసి ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, పెంపొందిస్తాయని అన్నారు. పోటీలో గెలుపు ఓటమి సహజం అని పోటీలు అనేవి మనసులో పట్టుదల అని పోటీతత్వాన్ని పెంచుతాయి అన్నారు. గ్రామ సర్పంచ్ గొర్రె కవిత రవి మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలను అశోక్ నగర్ గ్రామంలో నిర్వహించడం గర్వంగా ఉంది అన్నారు. ప్రథమ బహుమతి గా రూ. 20,016 మొత్తం ఐదు బహుమతులుగా నియమించారు దాతల సహాయంతో అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి జిల్లా లోని అనేక గ్రామాల జట్లు పాల్గొన్నట్లు మెగా ఆటో ని విజయవంతం చేసేందుకు సహకరించాలని కబడ్డీ అసోసియేషన్ తరపున క్రీడాభిమానులను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ఉమారాణి,గంగాధర,రమేష్, ఉపేందర్ రెడ్డి, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు