జెజె డెవలపర్స్‌లో కొత్త కోణం... కేసును దారి తప్పించేందుకే రిజిస్ట్రేషన్లు.?... పోలీసు కేసు అయిన పట్టించుకోని ఫైనాన్సియర్స్‌... అందుబాటులో లేని డెవలపర్స్‌... మరోసారి కలెక్టర్‌, రిజిస్ట్రార్‌, సిపికి ఫిర్యాదు చేయనున్న బాధితులు....

Submitted by SANJEEVAIAH on Wed, 20/03/2024 - 23:12
photos

ఫైనాన్సియర్స్‌ రిజిస్ట్రేషన్ల తంతు 

జెజె డెవలపర్స్‌లో కొత్త కోణం...

కేసును దారి తప్పించేందుకే రిజిస్ట్రేషన్లు.?

పోలీసు కేసు అయిన పట్టించుకోని ఫైనాన్సియర్స్‌

అందుబాటులో లేని డెవలపర్స్‌

మరోసారి కలెక్టర్‌, రిజిస్ట్రార్‌, సిపికి ఫిర్యాదు చేయనున్న బాధితులు

(నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా బ్యూరో ` ప్రజాజ్యోతి ` ఎడ్ల సంజీవ్‌)

జెజె డెవలపర్స్‌ కేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. వడ్డీ వ్యాపారం పేరుతో అక్రమాలకు పాల్పడుతూ సిరాస్థులను కాజేసే తంతులో పోలీసులు కలుగజేసుకోవడంతో ఫైనాన్సియర్స్‌ కొత్త నాటకానికి తెర లేపారు. ఇందుకు ఏకంగా పోలీసు కేసు నమోదు అయినప్పటికి తమకు అనుకూలంగా ఉన్న కొందరు కోనుగోలుదారులకు బుధవారం రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సమాచారం. బాధితుల మద్య విభేదాలు సృష్టించి పోలీసు కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ తాతంగం నడుపుతున్నట్లు బహిరంగ ప్రచారం జరుగుతుంది. పోలీసు కేసు నమోదు కావడంతో జెజె డెవలపర్స్‌ అందుబాటులో లేకుండా పోయారు. అప్పటికే పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చి ఫైనాన్సియర్స్‌ ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం. ఇదే అదనుగా చేసుకున్న ఫైనాన్సియర్స్‌ తమకు అనుకూలంగా నలుగురు బాధితులకు బుధవారం నిజామాబాద్‌ రూరల్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులను సైతం తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు చేసున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

అసలు సంగతి ఇది...

జెజె డెవలపర్స్‌ రియల్‌ వ్యవహారంలో వడ్డీ వ్యాపారుల తంతు కీలకంగా మారింది. తము ఇచ్చిన అప్పు వసూలు చేసుకునేందుకు గానూ తమకు సెల్‌ డీడ్‌ చేసిన ప్లాట్లను తాము చెప్పిన ధర చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తామని నమ్మబలికారు. ఇలా చేయడంతో పోలీసులను ఆశ్రయించిన వారిని తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ గజం ధర సమస్యగా మారింది. బుధవారం రిజిస్ట్రేషన్‌ చేసిన వారికి రూ.16 వేలకు గజం చోప్పున చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేసినట్లు బహిరంగ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి జెజె డెవలపర్స్‌ నుంచి గజం రూ.8 వేల నుంచి రూ.10 వేల ధరకు కోనుగోలు చేసారు. మద్యవర్తిగా ఉన్న జెజె డెవలపర్స్‌ రూ.12 వేల ధర వరకు ఇవ్వాలని కోరిన స్పందించని ఫైనాన్సియర్స్‌ చివరకు హఠత్తుగా కోనుగోలు చేసిన వారికి ఏ ధర చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేసారా.? లేక కేసును తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ బయటకు మాత్రం గజం ధర రూ.16 వేల చోప్పున చెల్లించడం వల్ల రిజిస్ట్రేషన్‌ చేసామని ప్రచారం చేస్తున్నారు. దీంతో కొంత కేసుల తలనోప్పి ఏందుకని, ఫైనాన్సియర్స్‌ను సంప్రదిస్తారనే ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిసింది. 

ఏందుకిలా...?

జెజె డెవలపర్స్‌తో భూయాజమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు. అప్పటికే డెవలపర్స్‌ ఇచ్చిన సమాధానంతో కేసు కొత్త మలుపు తిరుగుతుంది. దీంతో అప్రమత్తం అయిన ఫైనాన్సియర్స్‌ కొత్త నాటకానికి తెర తీసారు. అందులో భాగంగానే బాధితులకు రిజిస్ట్రేషన్‌ చేసి న్యాయం చేస్తున్నమనే కొత్త నాటకానికి తెర లేపినట్లు తెలుస్తుంది. దీని వల్ల బాధితులకు న్యాయం చేస్తున్నమని చెప్పి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఏలా స్పందిస్తారనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండే ఓ పోలీసు అధికారి కలుగజేసుకొని ఈ కే

ఫైనాన్సియర్స్‌ రిజిస్ట్రేషన్ల తంతు 
జెజె డెవలపర్స్‌లో కొత్త కోణం...
కేసును దారి తప్పించేందుకే రిజిస్ట్రేషన్లు.?
పోలీసు కేసు అయిన పట్టించుకోని ఫైనాన్సియర్స్‌
అందుబాటులో లేని డెవలపర్స్‌
మరోసారి కలెక్టర్‌, రిజిస్ట్రార్‌, సిపికి ఫిర్యాదు చేయనున్న బాధితులు

(నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా బ్యూరో ` ప్రజాజ్యోతి ` ఎడ్ల సంజీవ్‌)

జెజె డెవలపర్స్‌ కేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. వడ్డీ వ్యాపారం పేరుతో అక్రమాలకు పాల్పడుతూ సిరాస్థులను కాజేసే తంతులో పోలీసులు కలుగజేసుకోవడంతో ఫైనాన్సియర్స్‌ కొత్త నాటకానికి తెర లేపారు. ఇందుకు ఏకంగా పోలీసు కేసు నమోదు అయినప్పటికి తమకు అనుకూలంగా ఉన్న కొందరు కోనుగోలుదారులకు బుధవారం రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సమాచారం. బాధితుల మద్య విభేదాలు సృష్టించి పోలీసు కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ తాతంగం నడుపుతున్నట్లు బహిరంగ ప్రచారం జరుగుతుంది. పోలీసు కేసు నమోదు కావడంతో జెజె డెవలపర్స్‌ అందుబాటులో లేకుండా పోయారు. అప్పటికే పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చి ఫైనాన్సియర్స్‌ ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం. ఇదే అదనుగా చేసుకున్న ఫైనాన్సియర్స్‌ తమకు అనుకూలంగా నలుగురు బాధితులకు బుధవారం నిజామాబాద్‌ రూరల్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులను సైతం తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు చేసున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

అసలు సంగతి ఇది...

జెజె డెవలపర్స్‌ రియల్‌ వ్యవహారంలో వడ్డీ వ్యాపారుల తంతు కీలకంగా మారింది. తము ఇచ్చిన అప్పు వసూలు చేసుకునేందుకు గానూ తమకు సెల్‌ డీడ్‌ చేసిన ప్లాట్లను తాము చెప్పిన ధర చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తామని నమ్మబలికారు. ఇలా చేయడంతో పోలీసులను ఆశ్రయించిన వారిని తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ గజం ధర సమస్యగా మారింది. బుధవారం రిజిస్ట్రేషన్‌ చేసిన వారికి రూ.16 వేలకు గజం చోప్పున చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేసినట్లు బహిరంగ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి జెజె డెవలపర్స్‌ నుంచి గజం రూ.8 వేల నుంచి రూ.10 వేల ధరకు కోనుగోలు చేసారు. మద్యవర్తిగా ఉన్న జెజె డెవలపర్స్‌ రూ.12 వేల ధర వరకు ఇవ్వాలని కోరిన స్పందించని ఫైనాన్సియర్స్‌ చివరకు హఠత్తుగా కోనుగోలు చేసిన వారికి ఏ ధర చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేసారా.? లేక కేసును తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ బయటకు మాత్రం గజం ధర రూ.16 వేల చోప్పున చెల్లించడం వల్ల రిజిస్ట్రేషన్‌ చేసామని ప్రచారం చేస్తున్నారు. దీంతో కొంత కేసుల తలనోప్పి ఏందుకని, ఫైనాన్సియర్స్‌ను సంప్రదిస్తారనే ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిసింది. 

ఏందుకిలా...?

జెజె డెవలపర్స్‌తో భూయాజమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు. అప్పటికే డెవలపర్స్‌ ఇచ్చిన సమాధానంతో కేసు కొత్త మలుపు తిరుగుతుంది. దీంతో అప్రమత్తం అయిన ఫైనాన్సియర్స్‌ కొత్త నాటకానికి తెర తీసారు. అందులో భాగంగానే బాధితులకు రిజిస్ట్రేషన్‌ చేసి న్యాయం చేస్తున్నమనే కొత్త నాటకానికి తెర లేపినట్లు తెలుస్తుంది. దీని వల్ల బాధితులకు న్యాయం చేస్తున్నమని చెప్పి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఏలా స్పందిస్తారనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండే ఓ పోలీసు అధికారి కలుగజేసుకొని ఈ కేసును తప్పుతోవ పట్టించేందుకు సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఇది ఏంత వరకు వాస్తవమో కానీ ఇదే తరహాలో ఫైనాన్సియర్స్‌ రిజిస్ట్రేషన్లకు ముహుర్తం ఖరారు చేసినట్లు రుడి అయింది. దీంతో డెవలపర్స్‌ మరోసారి జిల్లా కలెక్టర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, జిల్లా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్దం అవుతున్నారు. 

రిజిస్ట్రేషన్‌ చేసేది మేమే...

ఈ రిజిస్ట్రేషన్లు వ్యవహారం తెలిసిన బాధితులు కొందరు ఫైనాన్సియర్స్‌ను సంప్రదిస్తే ‘‘మా పేరు మీద భూమి ఉంది. మాకు డబ్బులు అడిగిన ప్రకారం ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తాం. లేదంటే మీ దిక్కున్న చోట చెప్పుకోండి’’ అంటు హెచ్చరించినట్లు బాధితులు వాపోతున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు ఏలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. సర్వే నంబర్ల వ్యవహారంలో పోలీసు కేసులు నమోదు అయినప్పటికి సబ్‌ రిజిస్ట్రార్స్‌ ఏలా రిజిస్ట్రేషన్‌ చేసారు. దీని వెనక చక్రం తిప్పింది ఎవరు అనేది లెక్క తెలాల్సి ఉంది. చూద్దాం మరి పోలీసులు ఏలాంటి చర్యలు తీసుకుంటారో మరి. 

సును తప్పుతోవ పట్టించేందుకు సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఇది ఏంత వరకు వాస్తవమో కానీ ఇదే తరహాలో ఫైనాన్సియర్స్‌ రిజిస్ట్రేషన్లకు ముహుర్తం ఖరారు చేసినట్లు రుడి అయింది. దీంతో డెవలపర్స్‌ మరోసారి జిల్లా కలెక్టర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, జిల్లా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్దం అవుతున్నారు. 