Thursday, May 26, 2022

కాళేశ్వరం …తప్పుల తడక ప్రాజెక్ట్ – జీవన్ రెడ్డి

ఫలితంగా రూ.లక్షా 20 వేల కోట్ల అపðల భారం
సిఎం కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ జీవన్‌ రెడ్డి
జగిత్యాల,జనవరి11 : సీఎం కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయంతో తెలంగాణను పణంగా పెట్టారని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉంటే… ఇదివరకే తవ్వి ఉన్న కాలువలు ఉపయోగించుకునే అవకాశం ఉండేదన్నారు. సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. రూ.2 వేల కోట్లతో తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఉన్నా… దిగువన ఉన్న కాళేశ్వరం వద్ద నిర్మించారని… ఫలితంగా రూ.లక్షా 20 వేల కోట్ల అపðల భారం పడిందని ఆరోపించారు. దీనిపై మేధావులు, సాంకేతిక నిపుణులు ఆలోచించాలని జగిత్యాలలో నిర్వహించిన విూడియా సమావేశంలో అన్నారు. అంతేగాకుండా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌ ప్రాంతాల్లోని 2 లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. కవిూషన్ల కోసం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం తపðడు నిర్ణయమన్న జీవన్‌ రెడ్డి.. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని దుయ్యబట్టారు. ÖVమ్మడిహట్టి వద్ద నీటిని మళ్లింపు చేసుకునే విధంగా 148 విూటర్ల ఎత్తుతో… ప్రాజెక్ట నిర్మించుకుని నీటి మళ్లింపు చేసుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇంటర్‌స్టేట్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకోవడం జరిగింది. దిగువన మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించినా.. దిగువన ఎత్తిపోతల ద్వారా తరలింపు చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాపై రూ.1.20వేల కోట్ల అపðలతో కాళేశ్వరం ప్రాజెక్టు తలపెట్టింది. అనుమతులు ఉన్నా కూడా తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించుకోలేకపోయాం. మన హక్కులను మనం వినియోగించు కోలేకపోయామన్నారు. తెలంగాణ హక్కులను కేసీఆర్‌ ఫణంగా పెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ వెన్‌ గంగా నీళ్లను వద్దని.. వార్దా నీళ్లను మాత్రమే తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎగువ నీటిని కిందికి వదిలి మళ్లీ పైకి ఎత్తి పోయడం తెలివితక్కువ తనమన్నారు. కాళేశ్వరం డొల్లతనం బయట పడకుండా కేసీఆర్‌ కొత్త కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అంతా తపðల తడకన్నారు. కేసీఆర్‌ తపð విూద తపð చేస్తున్నారని మండిపడ్డారు. మేధావులు, సాంకేతిక వర్గం బయటకు వచ్చి కేసీఆర్‌ను నిలదీయాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కోరారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles