Monday, January 17, 2022

చిరంజీవికి జగన్ భరోసా….త్వరలోనే సినీ సమస్యలు పరిష్కారం..

జగన్‌ ఇచ్చిన ఆ భరోసాతో నాకు ధైర్యం వచ్చింది
సినిమా ఇండస్టీ సమస్యలపై సానుకూలంగా చర్చించాం
సమస్యకు పరిష్కారం దక్కగలదన్న ఆశాభావం ఉందన్న చిరంజీవి
సినీ ఇండ్‌స్టీ వారు ఇష్టం వచ్చినట్లుగా కమెంట్లు చేయవద్దు
జగన్‌తో లంచ్‌ చర్చల తరవాత విూడియాతో మెగాస్టార్‌
అమరావతి,జనవరి13 : సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిష్కారం దక్కే సూచనలు ఉన్నాయని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సమస్యలపై ఎపి సిఎం జగన్‌తో భేటీ తరవాత విూడియాతో మాట్లాడుతూ..సమస్యకు పరిష్కారం దక్కగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఒక పక్షానే ఉండను. అటు ఇటు అన్ని రకాలుగానూ అందరినీ సమదృష్టితో చూస్తాను. అందరికీ ఆవెూదయోగ్యమైన విధివిధానాలను తీసుకుంటాను. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.’ అని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. ఆ భరోసాతో నాకు ఎనలేని ధైర్యం వచ్చిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇండస్టీ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్‌తో చిరంజీవి గురువారం భేటీ అయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయం వద్ద చిరంజీవి విూడియాతో మాట్లాడారు. జగన్‌తో సమావేశం గురించి వివరించారు. జగన్‌ ఆహ్వానం మేరకే ఆయనతో భేటీ అయ్యానని, ఆ భేటీ సంతృఫ్తికరంగా జరిగిందని తెలిపారు. జగన్‌ తనకు సోదర సమానుడని, సీఎం దంపతుల ఆతిథ్యం ఎంతో బాగుందని ప్రశంసించారు. ఇండస్టీకి సంబంధించిన అన్ని విభాగాల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వం వేసిన కమిటీతోనూ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జగన్‌ చెప్పినట్లు చిరంజీవి తెలియజేశారు. జీవో 35 గురించి పునరాలోచిస్తామని సీఎం జగన్‌ హావిూ ఇచ్చినట్లు చిరంజీవి చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పరిశ్రమ వ్యక్తులు ఎవరూ విూడియాతో మాట్లాడొద్దని సూచించారు. తాను ఇండస్టీ పెద్దగా రాలేదని, ఇండస్టీ బిడ్డగా వచ్చానని చెప్పారు. ఇండస్టీలోని అందరితో చర్చించి, మళ్లీ ఇంకోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతానని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి పది రోజుల్లో సినీ పరిశ్రమకు శుభవార్త వస్తుందని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు అమరావతి వెళ్లిన మెగాస్టార్‌ చిరంజీవి, సీఎం జగన్‌ ఇంట ఆతిథ్యం స్వీకరించారు. సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై గంటన్నర పాటు మెగాస్టార్‌ చిరంజీవి కి, సీఎం జగన్‌ కు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినాట్లు తెలుస్తోంది. జగన్‌ గారితో తో సమావేశం చాలా సంతృప్తిగా జరిగింది. సంక్రాంతి పండగ పూట ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉంది. ఆయన నాతో మాట్లాడిన తీరు నాకు సంతృప్తిని ఇచ్చింది. ఇక గత కొన్ని నెలలుగా నడుస్తున్న విషయంపై ఎంతో విూమాంస ఏర్పడింది. జటిలమైన ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడానికి జగన్‌ గారు నన్నుఆహ్వానించారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక సైడ్‌ మాత్రమే కాదు రెండు సైడ్లు వినాలని, విూరు వస్తే ఒక విధివిదానాన్ని తయారుచేసి .. తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన నన్ను కోరడం ఎంతో భాద్యతగా అనిపించింది. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నా. సీఎం ప్రయత్నానికి అభినందనలు. ఇక అంతేకాకుండా థియేటర్ల వాళ్ళు పడుతున్న సాదరాబాధకాలు అన్ని తెలుపడం జరిగింది. ఆయన వెంటనే సానుకూలంగాస్పందించి ఉభయతర ఆవెూదయోగ్యంగా నిర్ణయానికి వచ్చి .. కమిటీకి చెప్తాము.. కమిటీ తుది నిర్ణయానికి వస్తాము అని చెప్పారు.. ఈ మాటలతో జగన్‌ గారిపై నాకు భరోసా వచ్చింది. నేను నమ్మకంగా చెప్తున్నా ఆయన మాటలు ఒక ధైర్యాన్ని ఇచ్చాయి. ఏదో మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి ఉంది. నేను ఒక పక్షాన ఉండను, అందరినీ సమదృష్టితో చూస్తానని, భయపడొద్దని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఒక మంచి నిర్ణయంతో వస్తామని చెప్పారు. అందరికి ఆవెూద యోగ్యం అయితే దాన్ని జీవో గా తీసుకొందామని చెప్పారు. అందరికి ఆవెూదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానన్నారు.ఈ వారం పదిరోజుల్లో లేదా నెలలో కొత్త జీవో వస్తుంది.చిన్న సినిమాలపై కూడా ఆలోచించి ఐదో ఆటకు అనుమతి ఇస్తానన్నారు అని చెపðకొచ్చారు. అనవసరంగా విూ కోపంతోటి, ఆందోళనతోటి ఎవరుపడితే వాళ్లు స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, మాటలు జారడం కానీ చేయవద్దు. పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని అనే నమ్మకం నాకు ఉంది. నా మాటను మన్నించి విూరందరు సమన్వయం పాటించాలని కోరుతున్నాను. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఎవరు మాట్లాడొద్దు’ అని తెలిపారు. ఇక ఈ ఇషఉ్యపై టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పలువురు తమ అభిప్రాయాలను ట్విట్టర్‌ ద్వారా, విూడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles