Monday, January 17, 2022

జగన్‌ నివాసంలో సంక్రాంతి వేడుకలు – సతీమణి భారతితో కలసి పాల్గొన్న ముఖ్యమంత్రి

హాజరైన మంత్రులు, పలువురు అధికారులు
అమరావతి,జనవరి14  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుక లకు సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతి హాజరయ్యారు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే లా వేడుకలు నిర్వహించారు. గంగిరెడ్డుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లల వేషభాషలతో కట్టిపడేశారు. వేడుకల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చిన్నారులతో సీఎం జగన్‌ సరదాగా కాసేపు ముచ్చటించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని పేర్కొన్నారు. ప్రతి ఇంట ఆనందాలు వెల్లి విరియాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. అత్యంత వైభవోపేతంగా సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్టాల్లో జరుగుతున్నాయి. ఉద్యోగ, వ్యాపారం కోసం ఎక్కడెక్కడో ఉన్న కుటుంబీ కులందరూ సంక్రాంతి పండుగకు ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్‌ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’ అంటూ ఆయన ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles