Monday, January 17, 2022

సంక్రాంతి సంబరాల్లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌,జనవరి14 : సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆయన నివాసంలో సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గంగిరెద్దు విన్యాసాలను తిలకించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో రైతు బంధు ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకూ 50వేల కోట్ల నిధులను విడుదల చేసిందని అన్నారు. రైతులు సంక్రాంతిని రైతుబంధు సంబురాలుగా నిర్వహించుకుంటున్నారని అన్నారు.
్గÖలంగాణ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి వుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ చేయూతతో రైతు పండగను ఘనంగా నిర్వహించుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles