రక్తం ఖరీదు ఎంత?

Submitted by Srikanthgali on Tue, 04/10/2022 - 18:33
రక్తం ఖరీదు ఎంత?

రక్తం ఖరీదు ఎంత?

మంట కలిసి పోతున్న మానవత్వం.

కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 04, ప్రజాజ్యోతి: భద్రాద్రి కొత్తగూడెం మతశిశు కేంద్ర ఎదురుగా వున్నా జాతీయ రహదారి కి ప్రక్కన ఉన్నటువంటి పొదలలో రక్తం తో నిండి వున్నా ఏబి పాజిటివ్ బ్లడ్ ప్యాకెట్ ఒకటి పడివుందడం స్థానికులు గుర్తించారు. అటువైపుగా వెళ్తున్న అమ్మ బ్లడ్ బ్యాంకు నిర్వాహాకుడు అయినటువంటి కార్తీక్ ఆ బ్లడ్ బ్యాగ్ ని గమనించి దానిని బయటకు తీయడం జరిగిందని  తెలిపాడు దానిమీద నవంబర్ 24 నుండి అక్టోబర్ 18 వరకు తేది ఉందని తెలిపాడు. ఈ బ్లడ్ చాలా సర్వసధారణంగా లభ్యం కాదని ఎవరు దీన్ని ఇక్కడ పడవేశారో తెలియడం లేదని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో వున్న గర్భిణీ స్త్రీలకి ఉపయోగించడానికి తీస్కొని రమ్మని చెప్పి వుంటారు తీరా అది అవసరం లేదు అనగానే ఎవరో ఇక్కడ పడేసి వుంటారు అని కార్తిక్ తెలిపారు. ప్రాణాలు కాపాడే రక్తాన్ని ఇలా వేయడానికి వారికి మనసు ఎలా ఒప్పిందో అని ఇది చాలా హెయమైన చర్య అని వాపోయారు. గర్భిణీ స్త్రీల కోసం తరచు అమ్మ బ్లడ్ బ్యాంకు సభ్యులు ఈ మాతాశిశు కేంద్రానికి వస్తుంటారని అత్యవసర పరిస్థితులలో తమ వంతు సహాయం చేస్తుంటామని కార్తీక్ తెలిపాడు. హాస్పిటల్ సిబ్బంది ఇలాంటి వాటిని గమనిస్తూ ఉండాలని ఇలాంటి చెర్యలు జరగకుండా తాగు జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చరించారు