ఇద్దరు దొంగల అరెస్ట్.

Submitted by Srikanthgali on Mon, 03/10/2022 - 19:01
ఇద్దరు దొంగల అరెస్ట్.

ఇద్దరు దొంగల అరెస్ట్.

కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 03, ప్రజాజ్యోతి:

ఇద్దరు దొంగలను 3వ టౌన్ పోలీసులు సోమవారం వాహనాల తనిఖీ చేస్తున్న సమయం లో అనుమానస్పదంగా ఉండడం తో వారిని విచారించగా వారు దొంగతనాలకు పాల్పడుతున్నారని అంగీకరించారు. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం కూలీలైన్ కి చెందిన షేక్ ఇర్ఫాన్ అను వ్యక్తి చిన్నప్పటి నుంచి దొంగతనాలకు అలవాటు పడి మొదటిసారి 2012వ సంవత్సరంలో కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరాజు హాస్పిటల్లో మొబైల్ దొంగతనం చేసి బాల నేరస్తుడిగా ఖమ్మంలో చిల్డ్రన్ హోమ్ లో గడిపాడని బయటకు వచ్చిన తర్వాత మరలా కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు హాస్పిటల్స్ లో మొబైల్ ఫోన్స్ దొంగతనాలు చేసి పలుమార్లు బాల నేరస్తుడిగా చిల్డ్రన్ హోమ్ నకు వెళ్లి దొంగలతో ఏర్పడిన పరిచయాల వలన ముఖ్యంగా రాత్రిపూట తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడటం అలవర్చుకున్నాడు అని ఎస్ పి వినీత్. జి తెలిపారు. ఈ సంవత్సరం మే నెలలో కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడి,పట్టుబడిన తరువాత భద్రాచలం సబ్ జైలుకు పంపించం అని భద్రాచలం జైలులో ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న విజయ్, పాల్వంచలో దొంగతనం కేసులలో నిందితుడిగా ఉన్న చల్లా వెంకట్ లతో పరిచయం ఏర్పడి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు అన్నారు.

ఈ సంవత్సరం జూన్ నెలలో షేక్ ఇర్ఫాన్ అలియాస్ చోటు, చల్లా వెంకట్ లు కలిసి కొత్తగూడెం పట్టణంలో మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలలో కొన్ని విజయ్ కు ఇవ్వగా అతను భద్రాచలంలోని ముతూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి తిరిగి వీరికి నగదును ఇచ్చేవాడు. చల్లా వెంకట్ దొంగతనానికి పాల్పడిన సొమ్ము నుండి 50,000 ల రూపాయలను తన సోదరి అయిన గొర్రె వసంతకు ఇచ్చాడన్నారు. మరలా ఇర్ఫాన్ కొత్తగూడెం 3టౌన్ పరిధిలో జులై నెలలో ఒక దొంగతనం, ఆగష్టు నెలలో రెండు దొంగతనాలకు పాల్పడి వీటిలో కొత్తగూడెం త్రీ టౌన్ పరిధిలోని గాజులు రాజాం బస్తి,గణేష్ టెంపుల్ వీధిలో పాల్పడిన దొంగతనాలలో ఇర్ఫాన్ తో పాటు ఇల్లందుకు చెందిన అజీమ్ కూడా ఉన్నాడు. ఇర్ఫాన్ కు అజీమ్ బాల్యమిత్రుడు. ప్రస్తుతం అజీమ్ హైదరాబాదులో అమెజాన్లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఇర్ఫాన్ అజీమ్ ద్వారా దొంగిలించిన కొన్ని బంగారు, వెండి ఆభరణాలను హైదరాబాద్ మనప్పురంలో తాకట్టు పెట్టించి మైసూర్, వైజాగ్ లాంటి పట్టణాలకు వెళ్లి విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు అన్నారు.

ఈ రోజు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా షేక్ ఇర్ఫాన్,అజీమ్ లు పోలీసువారిని చూసి కంగారుపడుతూ పారిపోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించి పోలీసు వారు అదుపులోకి తీసుకొని విచారించగా వారు ఇరువురు తాము చేసిన నేరాలను అంగీకరించారు. వారి వద్ద నుండి 78 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి ఆభరణాలు,03 మొబైల్ ఫోన్లు, 50,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకోవడమైనది అని ఎస్ పి తెలిపారు. గతంలో చల్లా వెంకట్ తన సోదరి అయిన గొర్రె వసంతకి ఇచ్చిన చోరీ సొత్తు 50,000 రూపాయలను కూడా రికవరీ చేసి అలాగే మునప్పురం హైదరాబాద్ నుండి 51 గ్రాములు, భద్రాచలం ముత్తూట్ నుండి 31 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేయవలసి ఉందన్నారు.

మొత్తం చోరీకి గురైన సొత్తు విలువ 13,00000 ల రూపాయల విలువ కాగా ఇప్పటివరకు 9,44,000 రూపాయల విలువ గల సొమ్మును రికవరీ అయినది తెలిపారు. వీరిరువురుని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరుగుతుంది అన్నారు. దసరా సెలవులకు దూరప్రాంతాలకు వెళ్లే వారు పోలీసు వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసారు.మీ సమాచారం అందించడానికి సబ్ డివిజన్ల వారిగా ఫోన్ నెంబర్లను ఇప్పటికే అందుబాటులో ఉంచడం జరిగిందిఅన్నారు. త్వరలోనే జిల్లా మొత్తానికి ఒకే ఫోన్ నంబరు ను కమాండ్ కంట్రోల్ కు జిల్లా పోర్టల్ కు అనుసంధానం చేయడం జరుగుతుంది అని జిల్లా ఎస్ పి డా. వినీత్. జి తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి వెంకటేశ్వర బాబు, 3 టౌన్ సిఐ అబ్బయ్య, కాన్స్టేబుల్స్ పాల్గొన్నారు.