Friday, May 27, 2022

యధేచ్చగా హుండీ వ్యాపారం..చోద్యం చూస్తున్న అధికారులు…..

— అద్దె , టూరిస్టు బస్సుల్లో గుట్టు చప్పుడు కాకుండా డబ్బు తరలింపు.
— పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కోట్లలో వ్యాపారం..

మెట్ పల్లి ,మే. ( ప్రజాజ్యోతి ప్రతినిధి ) : తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, జగిత్యాల్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ ల నుండి వేల మంది నిరుద్యోగులు పొట్టచేతపట్టుకొని బతుకుదెరువు కోసం కన్నవారిని, కట్టుకున్న వారిని వదిలి గల్ఫ్ దేశాలకు ఉపాధికోసం ఎడారి దేశాలకు తరలి వెళ్లిన వారంతా తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తం రూపాయలను కుటుంబీకులకు పంపేందుకు చుస్తున్నవారిని హుండీ వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు.దీంతో హవాలా ద్వారా డబ్బులను పంపుతున్నట్లు సమాచారం.ఇదే సమయములో హుండీ వ్యాపారులు, ఏజెంట్లు మాత్రం ఈ అవకాశాన్ని అనుకూలంగా మల్చుకుని సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగినట్లు స్పష్టమవుతుంది. హుండీ వ్యాపారులు ఈ హవాలా దందాను పెద్దఎత్తున కొనసాగిస్తున్నరనే ప్రచారం వాడి వేడిగా జరుగుతుంది. ముంబై, ఢిల్లీ, బెంగుళూర్,హైదరాబాద్ తదితర మహా నగరాలనుండి నుండి కొత్త కరెన్సీని చేజిక్కించుకుని యధేచ్ఛగా హుండీ వ్యాపారాన్ని మూడుపువ్వలు అరుకాయలుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా గల్ఫ్ బాధిత కుటుంబాల వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో హుండీ వ్యాపారులను సంప్రదిస్తూ వారి ఏజెంట్ల ద్వారానే తమ అవసరాలకు సరి పడ డబ్బులను తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇదే అదనుగా హుండీ వ్యాపారులు ఇదివరకటి కంటే ఎక్కువ మొత్తములో కమిషన్ ను వసూలు చేస్తూ హుండీ వ్యాపారులు ఎక్కువ మొత్తములో సొమ్ము చేసుకుంటున్నారు.

అద్దె బస్సులు, టూరిస్టు బస్సుల్లో గుట్టు చప్పుడు కాకుండా జోరుగా హుండీ దందా…

జిల్లా కేంద్రంలో పలువురు హుండీ వ్యాపారులు అద్దెబస్సులు , వెలుగు, టూరిస్ట్ బస్సులల్లో యధేచ్చగా హుండీ వ్యాపారం కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. కోట్లల్లో దందా చేసిన ఎలాంటి అనుమానం,సమాచారం అధికారులకు,పోలీసులకు అందదని హవాలా దారులు జోరుగా హుండీ దందా సాగిస్తున్నారు. ఒక్కొక్క సారి పెద్ద మొత్తములో పట్టుబడ్డప్పుడు, పెండ్లి కొరకు తీసుకెళుతున్నట్లు, వాహనాలు కొనడానికి వెళుతున్నాట్లు సాకు చెప్పి చాకచక్యంగా తప్పించుకున్నట్లు సమాచారం.దీనిపై అధికారులు కొంచెం దృష్టి పెడితే హుండీ వ్యాపారం గుట్టు తెలుస్తోందని పలువురు పేర్కొంటున్నారు.

పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో కోట్లల్లో వ్యాపారం.

మెట్ పల్లి డివిజన్ లోని పలు పట్టణాలతో పాటు మల్లాపూర్,ఇబ్రహీంపట్నం, రాయికల్ తో పాటు కథలాపూర్ ఖానాపూర్, మండలాల్లోని ఆ యా గ్రామాల్లో కోట్లల్లో హుండీ వ్యాపారం జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తన్నారని ప్రజలు పేర్కొంటున్నారు. మళ్ళీ పురుడు పోసుకున్న ఈ దందాపై పోలీసులు దృష్టిని కేంద్రీకరించక పోతే హుండీ వ్యాపారం వెళ్లునుకునే ప్రమాదం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles