Tuesday, July 5, 2022

వంట గదికి ధరల మంట – ఇటు కూరగాయాల పోటు .. అటు గ్యాస్ బండ వాత…

హైదరాబాద్‌,మే7 : మండు వేసవి మరింత వేడెక్కి ఎండలు భగభగమండుతున్నాయి.. ఉదయం 10గంటల నుంచి వడగాల్పులు వీస్తున్నాయి. పది నిమిషాలు రోడ్డుపై తిరిగితే నడినెత్తి చుర్రుమంటోంది. నాలుక తడారిపోతోంది.. మనిషి పరిస్థితి ఇలా ఉంటే..ఇక జంతువులు చెట్టూ చేమా పరిస్థితి చెప్పాల్సి లేదు. ఇక గ్యాస్ ,  కూరగాయల ధరలు ఎండల తీరుగానే భగ్గుమంటున్నాయి. గ్యాస్ బండపై రూ.50 పెంచేసింది కేంద్రం.. దీంతో ఇంటిలో వాడే గ్యాస్ సిలెండర్ ధర ప్రస్తుతం రూ.1060కి చేరింది.. దీంతో పాటే   పంటల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి..రూ.100కు రెండు, మూడు కూరగాయలు కూడా రావడం లేదు. వ్యాపారులను అడిగితే పంట తగ్గిపోయిందని చెబుతున్నారు. ఒక పక్క ఎండ సెగ..మరో పక్క కూరగాయల ధరల మంట చూసి నగరవాసులు ఉసూరుమనాల్సి వస్తోంది.. ఎండల తీవ్రత కూరగాయల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. కూరగాయలు పండించే రైతులకు నీరందక వందలాది ఎకరాల్లో పంట ఎండిపోయి దిగుబడి తగ్గిపోయింది. ఫలితంగా కూరగాయల ధరలు పెరిగిపోయాయి. ప్రజలు నిత్యం వినియోగించే టమాటా చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే మళ్లీ 45 నుంచి 50 రూపాయలకు కిలో పెరిగింది. నిత్యం వాడే ఉల్లి ధరలు మళ్లీ 25పైనే పలుకుతన్నాయి. ఎండాకాలంలో పంటల విస్తీర్ణం పరిమితమైంది. దిగుబడి కూడా సగానికి తగ్గి ఉత్పత్తి పడిపోయింది. దీంతో నగరానికి రావాల్సిన కూరగాయల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిందని అంటున్నారు. వేసవి ప్రభావం తీవ్రంగా ఉండటంతో భూమిలోని తేమ గంటల వ్యవధిలో ఆవిరవడంతో పంటలకు నీరు అందని పరిస్థితి. ఏర్పడుతోంది. భూగర్భ జలాలు వేగంగా అడుగంటి పోవడంతో బోర్లు ఉన్నా పనిచేయడం లేదు. ఎండ తీవ్రతకు,వడ గాలులకు వచ్చిన పూత కూడా రాలిపోవడంతో కాయలుకాయడం లేదని అంటున్నారు. బీర కిలో రూ.40కి పెరిగిపోయింది. అది రిటేల్‌ మార్కెట్లో 50 వరకు అమ్ముతున్నారు. అంటే రెట్టింపుయింది. బెండ కిలో రూ.25 నుంచి రూ.45కి పెరిగింది. అది రిటేల్‌లో 20కి పావు కిలో అమ్ముతున్నారు. అన్ని కూరగాయల ధరలుదాదాపు రెండు రెట్లు పెరిగింది. అన్ని కూరగాయల ధరలు దాదాపు ఇదే తీరులో పెరిగాయి. టవెూటా, బీర, గోరు చిక్కుడు సాగు చేసిన రైతులు అపð చేసి పెట్టుబడి పెట్టారు. తీరా ఇపðడిపðడే కాపు మొదలైందనుకున్న దశలో ఎండలకు ఉన్న పంట కాస్తా చేతికందకుండా పోతోంది. ఎండ తీవ్రత కారణంగా పంట ఎండిపోయిది. పెట్టుబడి కూడా చేతికి వస్తుందన్న నమ్మకం లేదని కూరగాయల రైతులు వాపోతున్నారు. ఎండల తీవ్రత ఇదే స్థాయిలో ఉండి, వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత తగ్గిపోయి పంటలు ఎండిపోతాయి. ఇప్పటికే 80 శాతం కూరగాయల పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. దిగుబడి ఇంకా పడిపోయి మార్కెట్‌కు కూరగాయలు రావడం కష్టమయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయని నగర మార్కెట్లకు సరఫరా చేస్తున్న వ్యాపారులు అంటున్నారు. దీంతో పాటే పచారి సరుకుల ధరలు కూడా సూర్యుడి ఎండతో పోటీ పడుతున్నాయి.. నూనె ధర రూ.200కు చేరువకు వచ్చేసింది..పప్పులు రూ.150 దాటేసి చాలా కాలమైంది.. కనీసం తాలింపు దినుసులు కూడా కొనే స్థితిలో లేవు.. ఇక పెట్రో, డిజిల్ ధరల గురించి చెప్పనవసరం లేదు… రోజూ వారి వాతతో వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి పెట్రో సంస్థలు.. దీంతో  సామాన్యులు, మధ్య తరగతి ప్రజలే కాకుండా ఉన్నత వర్గాలు సైతం ఈ ధరల భారం తట్టుకోలేకపోతున్నారు..కనుచూపు మేరలో ధరలు తగ్గే అవకాశాలు లేవని, ఇంకా పై పైకి పోతాయని మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles