Monday, January 17, 2022

తాడేపల్లిగూడెం వద్ద చేపల లారీ బోల్తా – నలుగురి దుర్మరణం..

తాడేపల్లిగూడెం..  పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపురం నుంచి దువ్వాడకు చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ తాడేపల్లిగూడెం వద్ద బోల్తా కొట్టింది. లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు మరో 6గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles