పండుగలు జాతి ఐక్యతకు దోహదపడతాయి

Submitted by Kramakanthreddy on Mon, 03/10/2022 - 14:37
 Festivals contribute to ethnic unity

 సామాజిక విప్లవానికి స్వతంత్ర ఉద్యమానికి పండుగలు తోడ్పాటునందించాయి

- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్, అక్టోబర్ 3 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :     ప్రపంచంలో ఏ దేశంలో, ఏ మతంలో లేనన్నీ పండుగలు హిందూ సంప్రదాయంలో ఉన్నాయని, బతుకమ్మ పండుగ మొదలుకొని అన్ని రకాల పండుగలను నిర్వహిస్తున్న జాతి హిందూ జాతి అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .  సోమవారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో  మాట్లాడుతూ హిందూ ధర్మం పుట్టినప్పటి నుండి పండగలు ఉన్నాయని, ప్రపంచంలో ఇతర మతాలు ఒకటి లేదా రెండు పండుగలను నిర్వహించుకుంటూ ఉండగా, హిందూ సంప్రదాయంలో మాత్రం అనేక పండుగలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకునేందుకు పండుగలు దోహదం చేస్తాయని,  ప్రజలందరి జాతీయ ఐక్యతకు దోహదం చేస్తాయని ,అంతేకాక స్వతంత్ర ఉద్యమ కాలంలో గణేష్ ఉత్సవ సమితి ఎంతో దోహదపడిందని అన్నారు. చారిత్రాత్మక, ఆధ్యాత్మికమైన పండుగలు ప్రపంచంలో మన భారతదేశంలోనే ఉన్నాయని ,ఎంతో భక్తిశ్రద్ధలతో సాంప్రదాయాల ప్రకారం పండుగలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లాలో దసరా ఉత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో, సంప్రదాయంగా చేస్తారని, అలంకరణ ఉత్సవంతో  ఏ జిల్లాలో చేయని విధంగా ఊరేగింపుగా అమ్మవారిని తీసుకురావడం, బాణసంచా పేల్చడం వంటివి నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా భక్తిశ్రద్ధలతో జమ్మి పూజ తో పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రజలకు బతుకమ్మ ,దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

వచ్చే సంవత్సరం ట్యాంక్ బండ్  ఐలాండ్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకునే ఏర్పాటు చేస్తామని, అప్పటివరకి పనులు పూర్తవుతాయని  చెప్పారు. పట్టణం, జిల్లా దిన దిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు . బతుకమ్మ ఉత్సవాలకు దసరా ఉత్సవాలకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు.దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మురళీధర్, ద్వజదారి సత్తురు చంద్రశేఖర్ గౌడ్, జిల్లా గ్రంధాల సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ గోపాల్ యాదవ్, గొర్రె కాపరుల సంఘం అధ్యక్షులు శాంతయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, ముడా చైర్మన్ గంజి ఎంకన్న ,మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, తదితరులు ఈ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు.