Thursday, May 26, 2022

అట్రాసిటీ కేసులో డీఎస్పీ విచారణ

ఇబ్రహీంపట్నం,అక్టోబర్19(ప్రజా జ్యోతి): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్క పెట్ గ్రామంలో దసరా పండుగ రోజు దుర్గ మాత ఊరేగింపులో జరిగిన సంఘర్షణలో భాగంగా ఏడుగురిపై అట్రాసిటీ కేసు నమోదు కావడంతో మంగళవారం గ్రామంలో మెట్ పల్లి డిఎస్పి రవీందర్ రెడ్డి విచారణ చేపట్టారు. మాదిగ కులానికి చెందిన జిల్లాపల్లి దిలీప్ , గుడేటి కాపు, తెనుగు, కమ్మరి కులాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు, దుర్గ మాత ఊరేగింపులో ఇతర కులాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు దిలీప్ మరియు సంఘ సభ్యులను డప్పులు కొట్టుతుండగా, కులం పేరుతో దూషించిన ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో మెట్ పల్లి డిఎస్పి వంగ రవీందర్ రెడ్డి గ్రామంలో విచారణ చేపట్టి సాక్షులను విచారించారు. డీఎస్పీ వెంట ఎస్ఐ రాజ ప్రమీల, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles