నాగిరెడ్డిపల్లి లో ఘనంగా దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 09:42
Doddi Komuraiya idol unveiled in Nagireddypally

బచ్చన్నపేట సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి: తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ జనగాం జిల్లా  బచ్చన్నపేట మండలము నాగిరెడ్డిపల్లి లో ఘనంగా జరిగింది. దీనికీ రాజకీయ కుల సంఘ ప్రముఖులు పాల్గొన్నారు.విగ్రహ దాతలు కాస జహంగీర్ కాస రంజిత్ లు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోయేలా ప్రతి ఒక్క కురుమ గొల్ల యువకుడు పాటుపడాలని రాజకీయంగా ఎదగడం సాధ్యమని దానికి ముఖ్యంగా విద్య అవసరమని అన్నారు. కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి స్వామి మాట్లాడుతూ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఆయన చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత అని రాజకీయ పార్టీలపై ఒత్తిడి వచ్చేలా ముందుండి పొరాటం చేస్తానని అసెంబ్లీఎన్నికల్లో కురుమలకు అత్యధికంగా ఎంపీ ఎమ్మెల్యే సీట్లు వచ్చేలా కృషి చేయాలని కోరారు . మాజీ కొమరవెల్లి చైర్మన్  సేవెల్లి సంపత్ మాట్లాడుతూ కురుమ గొల్ల లను ఎక్కువగా అభివృద్ది చేసింది కేసిఆర్ ప్రభుత్వము అనీ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి ,జనగాం ఏఎంసి చైర్ పర్సన్ విజయ, స్థానిక సర్పంచ్ భవాని శశిధర్ రెడ్డి , సాహస సర్పంచ్ గిద్దల రమేష్, నాగిరెడ్డి పల్లి దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవష్కరణ కమిటి సభ్యలు కన్నె అశోక్, చెట్కురి రాజు, కర్రే సిద్దులు,దొడ్డి రాజయ్య కిట్టు బాలరాజు రవి లతో పాటు ఎగుర్ల జయరాములు, కాస శ్రీనివాస్, బింగి  చంద్రం, కాస రాజు, గుంటీ అనిల్, బైర లింగం, ప్రశాంత్, ఒగ్గు పర్శరాం, గుంటి శ్రీను, కిషన్ తదితరులు పాల్గొన్నారు.