Thursday, May 26, 2022

కరోనా నుంచి కోలుకున్న ఉపాసన..

మెగా కోడలు, మెగా పవర్‌ స్టార్‌ సతిమణి ఉపాసన కొణిదెల షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. గతవారం తాను కోవిడ్‌ బారిన పడ్డానని, ప్రస్తుతం కోలుకున్నానని సోషల్‌ విూడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. చెన్నైలోని తన గ్రాండ్‌ పెరెంట్స్‌ను కలిసేందుకు కోవిడ్‌ టెస్ట్‌ చేసుకున్నానని, ఈ పరీక్షలో పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని తెలిపారు. దీంతో వారం రోజులుగా వైద్యుల సూచనతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ‘గత వారం కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ముందే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దీంతో డాక్టర్స్‌ నన్ను కేవలం పారాసిటమల్‌, విటమిన్‌ టాబ్లెట్స్‌ మాత్రమే వాడమని సూచించారు. ఈ మహమ్మారి సోకండంతో చాలా మంది నాకు నీరసించిపోవడం, హేర్‌ లాస్‌ అవ్వడం, బాడీ పెయిన్స్‌ వంటి సమస్యలు రావోచ్చని చెప్పారు. కానీ ఇపðడు ఆ సమస్యలు ఏం నాలో కనిపించడం లేదు. ఎందుకంటే నాకు నేను మెంటల్‌గా, ఫిజికల్‌గా స్టాంÖ-రగ్‌గా ఉన్నాను. అందుకే నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మళ్లీ వైరస్‌ విజృంభిస్తుందా అంటే చెప్పలేను. కానీ, మనం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. చెన్నైలోని తాతయ్య-అమ్మమ్మలను కలిసేందుకు కోవిడ్‌ పరీక్షలు చేసుకోవడం వల్ల వైరస్‌ బయటపడింది. లేదంటే అసలు తెలిసేదే కాదు’ అంటూ ఉపాసన రాసుకొచ్చారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles