Thursday, May 26, 2022

ఒక కుటుంబం – ఒకటే సీటు: కాంగ్రెస్ కొత్త విధానం

కాంగ్రెస్‌ నిర్ణయాలపై పికె ప్రభావం
ఆయన సూచనలు, సలహాలపై ఆచితూచి అడుగులు
ఆచరించి చూస్తే పోయేదేవిూ లేదన్న భావనలో నేతలు
న్యూఢిల్లీ,మే11 : పార్టీలో ప్రశాంత్‌ కిశోర్‌ చేరకున్నా ఆయన సూచనలు, సలహాలను పాటిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతున్నట్లుగా కనినిస్తోంది. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడమే గాకుండా కఠినంగా కూడా ముందుకు సాగాలని నిర్ణయించినట్లుగా సామచారం. ఇటీవల రాహుల్‌ తెలంగాణ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేసేవిగా ఉన్నాయి. అలాగే పొత్తులు, టిక్కెట్లపై పార్టీనేతలు పత్రికలు ఎక్కకుండా కట్టడి చేశారు. పార్టీ అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడకుండా కట్టడి చేశారు. ఇది ఓ రకంగా పార్టీలో అతిగా వ్యవహరించే వారికి, విూడియాకు ఎక్కేవారికి ముకుతాడు వేసినట్లు అయ్యింది. ఇదేరీతిలో దేశవ్యాప్తంగా నిర్ణయాలను తీసుకోబుతున్నారు.పార్టీని పునరుత్థానం వైపు నడిపించడంలో భాగంగా… ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ ఇవ్వాలనే నిబంధనను అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఈ నెల 13-15 తేదీల మధ్య రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌లో జరగనున్న మేధో మథన సదస్సులో ఇదే అంశం ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో కూడా ‘ఒక కుటుంబం – ఒకే టికెట్‌’ నిబంధనపై చర్చించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం మరోసారి జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిబంధనను పార్టీ ఆవెూదించే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధన గాంధీ కుటుంబానికి వర్తించబోదని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీగా ఎప్పటినుంచో విమర్శిస్తోన్న బీజేపీకి ఈ మినహాయింపు మరో అస్త్రం కావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా పార్లమెంటరీ బోర్డును పునరుద్ధరించే ఆలోచన ఉందని ఓ కాంగ్రెస్‌ నేత చెప్పారు. చర్చల అనంతరం ఉదరుపూర్‌ డిక్లరేషన్‌ పేరుతో నిర్ణయాలను ప్రకటిస్తారని తెలిపారు. ఒకవ్యక్తికి ఒకే పదవి అన్న సూత్రాన్ని జోడుపదవులు అనుభవిస్తున్న నాయకులం దరికీ కాంగ్రెస్‌ వర్తింపచేయగలదా అన్న చర్చను అటుంచితే, రాజస్థాన్‌లో కొద్దికాలం సద్దుమణిగిన అంతర్గతపోరు మళ్ళీ రాజుకొని సోనియాగాంధీకి అగ్నిపరీక్ష పెడుతోంది. ఇటీవలే సచిన్‌ పైలట్‌ ఆమెనూ, ప్రియాంకనూ కలుసుకొని మనసులో ఉన్న ఆగ్రహాన్నంతా కక్కేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రిగా ఎవరి నాయకత్వంలో ఎన్నికలకు పోవాలో వెంటనే నిర్ణయించా లని ఆయన అధిష్ఠానాన్ని కోరారు. పంజాబ్‌లో జరిగింది రాజస్థాన్‌లో పునరావృతం కాకూడదని గుర్తు చేశారు. వరుసగా పలుమార్లు కలిసి నా స్థానం ఏమిటో ముందే తేల్చిచెప్పండని ఆయన మర్యాదగానే పార్టీ
అధిష్ఠానాన్ని అడుగుతున్నాడు. రాజస్థాన్‌కు తన నాయకత్వం అవసరమని గుర్తుచేస్తున్నారు. రెండేళ్ళ క్రితం ఆయన ఓ ప్దదెనిమిదిమంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుచేయడం, ముఖ్యమంత్రి అశోక గెహ్లాట్‌ తన వందమంది ఎమ్మెల్యేలను ఎక్కడో రిసార్టులో దాచటం, కొద్దివారాల తీవ్ర రాజకీయ ఉత్కంఠ తరువాత గాంధీలు ఎట్టకేలకు పైలట్‌ ను బుజ్జగించడం తెలిసిందే. ఆయన మద్దతుదారులకు ఏవో కొన్ని పదవులు దక్కినప్పటికీ, సోనియా ఆశీస్సులు, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున అశోక గెహ్లాట్‌ పెత్తనం ఏమాత్రం సన్నగిల్లలేదు. మరోపక్క, జ్యోతిరాదిత్య, జితిన్‌ ప్రసాద వంటి తోటి కాంగ్రెస్‌ యువనాయకులు పార్టీని వీడి రాజకీయలబ్ది పొందిన నేపథ్యంలో పైలట్‌ కూడా ఆగడం లేదు. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను సీఎంని చేయండి, లేకుంటే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం అని పైలట్‌ విస్పష్టంగా ప్రకటించినట్టు వార్తలు వస్తున్నప్పటికీ, మరికొద్దినెలలు ఓపికపట్టమన్న పాతపాటే అధిష్ఠానం పాడతున్నదట. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో ఎందుకు చేరలేదు, అందుకు కారకులెవ్వరన్నది అటుంచితే, ఆ పార్టీకి కావాల్సింది సరైన నాయకత్వమనీ, తాను కాదనీ, తాను చేరకున్నా ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాల్సింది ఆ పార్టీయేనని ఆయన వరుసగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కాంగ్గరెస్‌ ఆయన చేసిన సూచనలను అమలుపెట్టి ఫలితాలు ఎలా ఉంటాయో అని వేచిచూస్తున్నట్లుగా ఉంది. మే 13నుంచి జరిగే ‘నవ సంకల్ప చింతన్‌ శివర్‌’లో కాంగ్రెస్‌ తనను తాను ప్రక్షాళించుకొనే దిశగా సాహోసేపేతమైన నిర్ణయాలు చేస్తుందని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles