Monday, January 17, 2022

చిరంజీవితో జ‌గ‌న్ ‘ఊ’… అంటారా.. ‘ఊహూ’ అంటారా…

అమ‌రావ‌తి – ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ధ‌ర‌ల త‌గ్గింపు విష‌యంపై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల మంత్రి పేర్ని నానీతో చ‌ర్చించారు.. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి దీనిపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తో నేడు చ‌ర్చించ‌నున్నారు.. అయితే సినిమా టిక్కెట్ల ధరలపై సీఎం జగన్‌తో మెగాస్టార్‌ భేటీకానుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. . హైద‌రాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చిరంజీవి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకొని సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. మెగాస్టార్‌ చిరంజీవికి సీఎం జగన్‌ లంచ్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. మెగాస్టార్ ను జ‌గ‌న్ స్వ‌యంగా ఆహ్వానించ‌డం విశేషం.. మ‌రి ఈ బేటీలో సినిమా టిక్కెట్స్ విష‌యంలో ప‌రిష్కారం ల‌భిస్తుంద‌నే ఆశ‌తో టాలీవుడ్ ఉంది..

Related Articles

- Advertisement -spot_img

Latest Articles