Monday, January 17, 2022

రాజ్యసభ ఆఫర్‌ – రాజకీయాలకు దూరంగా ఉన్నానన్న చిరంజీవి

విజయవాడ,జనవరి14 :  మెగాస్టార్‌ చిరంజీవి  విూడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని వైసీపీ ప్రభుత్వం రాజ్యసభకు పంపబోతోందనే ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఆఫర్‌ వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను రాజకీయాలకు పూర్తి దూరమని స్పష్టం చేశారు. వైసీపీ తనకు రాజ్యసభ ఆఫర్‌ చేసిందని వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. వైసీపీ తనకు రాజ్యసభ ఇస్తానన్నది ఊహాజనితమేనని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు తాను అతీతమని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని చెప్పారు. ఇలాంటి ఆఫర్లను తాను కోరనని ప్రకటించారు. అటువంటి వాటికి తాను దూరమని చిరంజీవి స్పష్టం చేశారు. విజయవాడ పర్యటనలో మెగాస్టార్‌ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌తో సమావేశం ముగించుకుని హైదరాబాద్‌ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన చిరంజీవి విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు ప్రకటించారు. తనకు రాజ్యసభ టిక్కెట్‌ వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోనని చిరంజీవి స్పష్టం చేశారు.

‘తెలుగు సినీ పరిశ్రమ కోసం, థియేటర్ల మనుగడ కోసం ఏపీ సీఎం జగన్‌ను కలిశాను. ఆ చర్చలను పక్కదోవ పట్టించే విధంగా రాజకీయ రంగు పులుముతున్నారు. వైఎస్సార్‌సీపీ నాకు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసిందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం.’ అని మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles