గత కొంతకాలంగా మెగా హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నాయి. ఏడాది ప్రారంభంలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ‘భీమ్లా నాయక’ సినిమా హిట్ టాక తో కూడా భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. వరుణ్ తేజ్ ‘గని’ మూవీ డిజాస్టర్ అయింది. ఇదే క్రమంలో మెగా తండ్రీకొడుకులు చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా టాలీవుడ్ లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. దీంతో నిరాశ చెందిన మెగా అభిమానులు.. ఇపðడు చిరు – పవన్ లైనప్లో ఉన్న ప్రాజెక్ట్స ఆసక్తికరంగా లేవని నిరుత్సాహానికి గురవుతున్నారని టాక వినిపిస్తోంది.
చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ వంటి రెండు రీమేక చిత్రాలతో పాటుగా బాబీ దర్శకత్వంలో మెగా 154 సినిమాలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో ‘హరి హర వీర మల్లు’ ‘భవదీయుడు భగత్ సింగ్’ మరియ తమిళ చిత్రం ‘వినోదయ సీతమ్’ రీమేక ప్రాజెక్ట్స ఉన్నాయి. ఇపðడు అందరూ పాన్ ఇండియా రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో.. మెగా దిగ్గజాలు లైన్ లో పెట్టిన సినిమాలేవీ ఫ్యాన్స్ ను అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. అయితే వారితో పోల్చుకుంటే రామ్ చరణ్ కి మంచి లైన్ అప్ ఉందని భావిస్తున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సి15 చిత్రంలో నటిస్తున్నారు చరణ్. ఇది పాన్ ఇండియా మూవీ. అయినప్పటికీ చెర్రీ కంటే అల్లు అర్జున్ లైనప్ లో ఆసక్తికరమైన ప్రాజెక్ట ఉందని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో నార్త్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన బన్నీ.. జక్కన్న సహాయం లేకుండానే సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. నేషనల్ వైడ్ ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట అంతా ఇంతా కాదు. దీంతో ఇపðడు ‘పుష్ప 2’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సహజంగానే ఇది సీక్వెల్ ప్రయోజనాన్ని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ‘పుష్ప: ది రూల్’ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా.. పాజిటివ్ టాక వస్తే మాత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో చరణ్ కంటే అల్లు ఫ్యామిలీ నుంచి ఎదుగుతున్న బన్నీ కాస్త ముందున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి.