కొమ్ముల గూడెం గ్రామంలో బ్రతకమ్మ బృందానికి డీజే సౌండ్ సిస్టం బహుకరణ సోడె పోగు వెంకట ముత్యం

Submitted by veerabhadram on Sun, 02/10/2022 - 13:45
Bathukamma

చండ్రుగొండ  ప్రజాజ్యోతి. అక్టోబర్ 2:

 

 చండ్రుగొండ మండలం తుంగారం పంచాయతీ పరిధిలో కొమ్ములగూడెం గ్రామం లో బతుకమ్మ బృందానికి సోడేపోగు వెంకట ముత్యం 75 వేల రూపాయలు విలువైన డిజె సౌండ్ సిస్టం బహుమతిగా ఇచ్చారు. గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తమ, తమ బతుకమ్మలతో, ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో వెంకటముత్యం మాట్లాడుతూ, గ్రామంలో పిల్లలు, పెద్దలు మహిళలు బతుకమ్మ , దసరా పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పుల వీరస్వామి,నోముల వెంకటేశ్వర్లు, సిద్దెల భారతి, చాపలమడుగు భూదేవి, సోడిపోగు పద్మ, సోడెపోగు రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.