మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు.

Submitted by veerabhadram on Sat, 01/10/2022 - 17:54
bathikamma sambaralu

 ప్రజా జ్యోతి  అక్టోబర్ 1 చుండ్రుగొండ:

తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం ఈరోజు మండల ప్రజా పరిషత్  కార్యాలయంలో ఏడవ రోజు బతుకమ్మ సంబరాల్లో అతిథిగా హాజరై బతుకమ్మ పాటలకు ఆడి పాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతకమ్మ పండుగ మన బతుకులను మార్చే పండగని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మన పండుగలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో,భాగంగా మహిళలు బతుకమ్మలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ అంగన్వాడీ ల కూరగాయల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ, సిడిపిఓ నిర్మల జ్యోతి, తాసిల్దార్ వర్షా రవికుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శకుంతల, రాణి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, వైస్ ఎంపీపీ నరుకుల్ల సత్యనారాయణ, ఎంపీటీసీలు ధారా వెంకటేశ్వరరావు, లంక విజయలక్ష్మి, టిఆర్ఎస్ నాయకులు మాలోతు బొజ్యా నాయక్, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, భూపతి శ్రీనివాసరావు,భూపతి రమేష్, వంకాయలపాటి బాబురావు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు...