బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారి బతుకమ్మ ఉయ్యాలా..

Submitted by Srikanthgali on Mon, 03/10/2022 - 19:48
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారి బతుకమ్మ ఉయ్యాలా..
  • బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...

  • బంగారి బతుకమ్మ ఉయ్యాలా...

  • కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 03, ప్రజాజ్యోతి:

  • కొత్తగూడెం నియోజక వర్గ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో బతుకమ్మను ఆరాధించి అనుగ్రహం పొందేందుకు ఆడపడుచులు, ఆనందల్లాసా లతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో గౌరమ్మను కొలు సుకుంటున్నారు. బతుకమ్మ పండుగలో తోమిదవ రోజు సద్దుల బతుకమ్మగా గౌరమ్మను నిలిపి కోలాట నృత్యా లతో ఆడిపాడి పూజిస్తున్నారు. మహిళలు, ఆడపిల్లలు ఎంతో సంబురంగా పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ అవనిని పులకింపజేస్తున్నారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజారంజకమైన పాటలు పాడుతు, అమ్మను పూజించుకుంటున్నారు.