Thursday, May 26, 2022

లక్ష కిరాణా స్టోర్స్ ను చేర్చుకోవడం లక్ష్యంగా బ్యాంకిట్ ముంద‌డుగు..

లక్ష కిరాణా స్టోర్స్ ను చేర్చుకోవడం లక్ష్యంగా బ్యాంకిట్ ముంద‌డుగు..

హైదరాబాద్, 30 నవంబర్ 2021: తెలంగాణలో తన ఉనికిని పటిష్ఠం చేసుకునేందుకు 2022 ఆర్థిక సంవత్సరంలో ఒక లక్షకు పైగా కిరాణా దుకాణాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు అగ్రగామి ఫిన్ టెక్ స్టార్టప్ బ్యాంకిట్ ప్రకటించింది. ఈ అవుట్ లెట్స్ లో మెడికల్ దుకాణాలు, రీచార్జ్ షాప్స్, కిరాణా దుకాణాలు లాంటివి ఉంటాయి. గత కొద్ది నెలలుగా కంపెనీ రాష్ట్రంలో తన ఉనికిని 50% మేర అధికం చేయడం ద్వారా హైపర్ లోకల్ డెలివరీ సామర్థ్యాన్ని విస్తరించుకోవడంలో గరిష్ఠ వృద్ధిని చవిచూసింది.
విస్తరణ ప్రణాళికల్లో భాగంగా సంస్థ 29 రాష్ట్రాలలో ఉనికి కలిగిఉంది. ప్రస్తుతం బ్యాంకిట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో 17,500 దాకా ఆపరేషనల్ అవుట్ లెట్స్ కలిగి ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇది 50% పైగా గ్రామాలు, పట్టణాలల్లో ఉనికి కలిగిఉంది. ఏప్రిల్ 21 నుంచి అక్టోబర్ 21 మధ్య కాలంలో8,600 మంది ఏజెంట్లు సంస్థతో కలసి ప్రయాణించడం మొదలుపెట్టారు. వీరితో కంపెనీ ఇప్పటి వరకూ 75 లక్షలకు పైగా ఖాతాదారులకు సేవలను అందించింది. బ్రాండ్ ఉనికిని విస్తరించేందుకు కంపెనీ తెలంగాణలో యూపీఐ ద్వారా చెల్లింపుల వంటి ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్లతో నూతన వస్తు సేవల శ్రేణులను విస్తరిస్తోంది. తిరుగులేని సేవలను అందించేందుకు వీలుగా గత ఆరు నెలల్లో 3,800 మైక్రో ఏటీఎంలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. దీంతో ఏజెంట్ల నుంచే గ్రాస్ ట్రాన్సాక్షన్ వాల్యూ (జీటీవీ) రూ.11,000 కోట్లకు పెరిగింది. అంతేగాకుండా కంపెనీ తెలంగాణలో వచ్చే ఏడాది రూ.35,000 కోట్ల జీటీవీని సాధించడం లక్ష్యంగా చేసుకుంది.
విస్తరణ ప్రణాళిక గురించి బ్యాంకిట్ సిఒఒ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అమిత్ నిగమ్ మాట్లాడుతూ, ‘‘గత రెండేళ్ల కాలం యావత్ ఫిన్ టెక్ ఆవరణవ్యవస్థకు రోలర్ కోస్టర్ రైడ్ తరహాలో గడిచింది. ఇది మహమ్మారి అనంతర కాలంలో మరింత మెరుగ్గా వ్యవహరించేందుకు వీలుగా మా విధానాలను, ప్రక్రియలను మదింపు వేసుకునేందుకు తోడ్పడింది. ఇప్పటికే దేశవ్యాప్త ఉనికి కలిగిన మేం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మా కార్యకాలాపాలను అధికం చేయడంపై దృష్టి పెట్టాం. మా ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ఈ రాష్ట్రాల్లో మేం మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకెళ్లగలిగాం. పటిష్ఠమైన ఫిన్ టెక్ ఫ్రేమ్ వర్క్ ను నిర్మించడంలో భాగంగా టియర్ 3, 4 కి చెందిన పట్టణాలకూ చేరుకోగలిగాం. ఆర్థికంగా సాధికారికత కలిగిన భారతదేశాన్ని నిర్మించడంలో ఒక అద్భుత ప్రయాణానికి ఆరంభంగా మేం దీన్ని విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
కోవిడ్ -19 రెండో వేవ్ సందర్భంలోనూ తెలంగాణలోని టియర్ 2, 3 పట్టణాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు విత్ డ్రా సేవలను బ్యాంకిట్ అందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో తన ఏజెంట్ నెట్ వర్క్ ద్వారా కస్టమర్ల కోసం 2021 మే నెలలో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ ను కూడా నిర్వహించింది. తద్వారా లక్షలాది మంది వ్యాక్సిన్ పోర్టల్ లో తమ పేర్లు నమోదు చేసుకునేలా చేసింది.

బ్యాంకిట్ గురించి:
బ్యాంకిట్ అనేది ఐఎస్ఒ 27001:2013 సర్టిఫైడ్ ఫిన్ టెక్ కంపెనీ. ఆవిర్భవించిన నాటి నుంచి కూడా దేశంలో బ్యాంకింగ్ సేవలు అందని ప్రాంతాల్లో, అరకొరగా ఉన్న ప్రాంతాల్లో అక్కడి వారి సాధికారికత కోసం కృషి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన చరిత్ర దీనికి ఉంది. అదే సమయంలో తన ఏజెంట్లకు సులభమైన, వేగవంతమైన, సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల పరిష్కారాల ద్వారా ఆదాయం ఆర్జించుకునే అవకాశాలను కూడా కల్పించింది. బ్యాంకింగ్, ఆర్థిక సవలకు సంబంధించి బ్యాంకిట్ యొక్క వన్ స్టాప్ అవుట్ లెట్స్ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ ఫర్, ఏఈపీఎస్, మినీ ఏటీఎం, క్యాష్ విత్ డ్రాయల్స్, ప్రిపెయిడ్ కార్డులు, రీచార్జీలు, బిల్లు చెల్లింపులు, బీమా, వాలెట్ రీచార్జ్, ట్రావెట్ అండ్ స్టే బుకింగ్స్ వంటి తక్షణ, ఇబ్బందిరహిత సేవలను అందిస్తాయి. వృద్ధి, విస్తరణ ప్రణాళికలల్లో భాగంగా కంపెనీ ఇప్పుడు ఆయా వ్యాపారాలకు కస్టమైజబుల్ కార్డ్ సొల్యూషన్స్ అందించడం లోకి కూడా ప్రవేశించింది. ఎంఎస్ఎంఇలు, స్టార్టప్స్, కార్పొరెట్ సంస్థలు తమ సిబ్బంది, కస్టమర్లు, భాగస్వాములకు సంబంధించి మనీ మేనేజ్ మెంట్ ను సులభతరం చేసుకునేందుకు ఇవి వీలు కల్పిస్తాయి.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles