Monday, January 17, 2022

దగ్గుబాటి ఇంటి భోగి సంబరాల్లో పాల్గొన్న బాలయ్య

ఒంగోలు,జనవరి14 :తెలుగు రాష్టాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. ఉభయ తెలుగు రాష్టాల్లో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు ప్రజలు.. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంటలు వేసి.. పెద్దలు, చిన్నారులు అంతా కలసి సందడిగా గడిపారు.. ఇక, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భోగి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.. ప్రకాశం జిల్లా కారంచేడుకు విచ్చేసిన సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాల్లో పాల్గొన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులతో కలసి సందడి చేశారు.. భోగి వేడుకల్లో పాల్గొన్నారు బాలకృష్ణ దంపతులు.. ఇక, లోకేశ్వరి, ఉమామహేశ్వరి.. ఇలా నందమూరి కుటుంబ సభ్యులంతా ఓ చోట చేరడంతో అసలైన పండుగ వాతావరణం కనిపించింది. భోగీ వేడుకల్లో పాల్గొనేందుకు లెజండ్‌ బాలకృష్ణ గురువారం కారంచేడు చేరుకున్నారు.. బాలయ్య తన చిన్నతనంలో ఎక్కువ భాగం కారంచేడులోనే గడిపారని.. సెలవుల్లో ఎక్కువగా ఇక్కడే ఉండేవారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఓ సందర్భంలో తెలిపిన విషయం తెలిసిందే.. బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారమే కారంచేడుకు చేరుకున్నారు. గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకోవడంతో సందడి నెలకొంది. ఈ సందర్బంగా తెలుగువారందరికీ టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త వాటికి, మేలు చేసే వాటికీ ఇంట్లో చోటిమ్మని చెబుతోంది భోగి పండుగ అని… వస్తువులకే కాదు ప్రభుత్వాలకైనా అదే సూత్రం వర్తిస్తుందన్నారు. అపðడే జన జీవితాలకు కొత్త వెలుగులు వస్తాయని తెలిపారు. సంక్రాంతికి స్వాగతం పలుకుతూ సంబరాల కాంతిని వెదజల్లే భోగిమంటలు మన కష్టాలను హరించాలని లోకేష్‌ అన్నారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles