Thursday, May 26, 2022

అల్లవరాన్ని తాకిన అసని తుపాన్ – కోస్తా అల్లకల్లోలం..

అల్లవరంతో తీరాన్ని తాకిన అసని
బలహీనపడ్డ అసని తుఫాన్‌
వాయుగుండం ప్రభావంతో తీరప్రాంతం అల్లకల్లోలం
తీరం వెంబడి గంటకు 85 నుంచి 90 కిలోవిూటర్ల వేగంతో గాలులు
పలు జిల్లల్లో వర్షాలతో అతలాకుతలం
విశాఖపట్నం, :బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను అనూహ్యంగా దిశ మార్చుకుంది. వాయవ్య దిశకు పయనిస్తుందని ముందు అనుకున్నా.. ఇప్పుడా తుపాను ఆగ్నేయ దిక్కుకు మళ్లింది. నర్సాపురానికి 30 కిలోమీటర్ల దూరంలోని దిగువన అల్లవరం  సమీపంలో తీరాన్ని తాకింది.. దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల వెూస్తరు వర్షాలు పడుతున్నాయి. సముద్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరం అలల ఉధృతితో అల్లకల్లోలంగా మారింది. తీరానికి రక్షణగా వేసిన రాళ్లు బీచ్‌ రోడ్డుపైకి ఎగసి పడుతున్నాయి. నాలుగు విూటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండడంతో బీచ్‌ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో, ఉప్పాడ-కాకినాడ బీచ్‌ రోడ్‌లో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఈ నెల బుధ, గురువారాల్లో కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు యానాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మచిలీపట్నం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఎనిమిదో నెంబరు ప్రమాద సూచక, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో పదో నెంబరు ప్రమాద సూచక ఎగరవేశారు. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సముద్రానికి దగ్గరగా ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు గుడిసెల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అన్నిచోట్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే జగన్ కూడా నేడు అసని తుపాన్ పై సంబంధిత అధికారులతో, ఆయా జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫ్ రెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.. తరలించిన ప్రతి కుటుంబానికి రెండు వేల నగదును తక్షణ సాయం కింద అందించాలని ఆదేశించారు..  రక్షిత శిబిరాలలో 24 విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, నిరాశ్రయులకు మంచినీరు , ఆహారం, పిల్లలకు పాలు అందించాలని కోరారు.. సహాయ కార్యక్రమాలలో తక్షణం సిబ్బంది దిగాలని కోరారు..ఇక , ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలెక్టర్లు కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. లైజాన్‌ ఆఫీసర్లను ఏరియాల వారీగా నియమిస్తూ రాత్రీ, పగలూ కాపలా కాయాలంటూ ఆదేశించారు. విశాఖపట్నం నుంచి సోమ, మంగళవారాలు కలిపి 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుపాను తీవ్రత తగ్గే వరకూ రద్దు కొనసాగుతుందని విశాఖపట్నం ఎయిర్‌ పోర్టు డైరెక్టర్‌ వెల్లడించారు. గాలుల తీవ్రతకు విశాఖ నగరంలో కొన్ని చోట్ల హోర్డింగులు విరిగిపడ్డాయి. పాత నగరంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతంలో ఇళ్ల మధ్య ఉన్న కొబ్బరి చెట్టు విరిగి పడడంతో రెండు గృహాల పిట్ట గోడలు దెబ్బతిన్నాయి. ఒక ఇంటి స్లాబ్‌కు కొంత నష్టం వాటిల్లింది. 16వ వార్డు పరిధిలోని కెఆర్‌ఎం కాలనీలో కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో 28 మిల్లీవిూటర్ల వర్షపాతం నవెూదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లాల్లో 7.3 మిల్లీవిూటర్ల సగటు వర్షపాతం నవెూదైంది. సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో వర్షాలకు ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలి అక్కడ ఆడుకుంటున్న నాలుగో తరగతి విద్యార్థి బోకర దేవేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్ర తీరానికి ఓ రథం కొట్టుకొచ్చింది. ఒడిశాకు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జాతీయ రహదారులు, పలు గ్రామాల్లో భారీ వక్షాలు కూలిపోయాయి. మామిడి, జీడి మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికంది వచ్చిన వరి పంట కళ్లాల్లోనే ఉండడంతో అకాల వర్షంతో కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసని తుపాన్ రైతులకు కన్నీళ్లనే మిగిల్చింది.. గత ఏడాది కూడా మే నెలలో తుపాన్ విరుచుకుపడటంతో అప్పుడూ రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు.. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తలెత్తడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు..

Related Articles

- Advertisement -spot_img

Latest Articles