Monday, January 17, 2022

లక్నో, అహ్మదాబాద్‌లకు బీసీసీఐ డెడ్‌లైన్‌

22వ తేదీలోగగా ఇద్దరు ఆటగాళ్లను ఎన్నుకోవాలి
యధావిధిగా ఐపిఎల్‌-2022 వేలం
ఫిబ్రవరి12,13 తేదీల్లో నిర్వహించే ఛాన్స్‌
ముంబై,జనవరి12 : ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీలైన లక్నో, అహ్మదాబాద్‌లకు బీసీసీఐ డెడ్‌లైన్‌ విధించింది. మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అంశంపై తుది గడువును ప్రకటించింది. జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఇరు జట్లు చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) ఎంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఇరు జట్లకు మెయిల్‌ చేసింది. గతంలో ఆటగాళ్ల రిక్రూట్‌మెంట్‌ పక్రియ పూర్తి చేసేందుకు జనవరి 31ని గడువు తేదీగా నిర్ణయించిన బీసీసీఐ.. ముగ్గురు ఆటగాళ్ల ఎంపికకు అంత సమయం అవసరం లేదని భావించి, సవరించిన తేదీని ప్రకటించింది. 11న జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీలో బీసీసీఐ మరో కీలక ప్రకటన కూడా చేసింది. బెట్టింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీకి ఎట్టకేలకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. దీంతో పాటు మెగా వేలానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ పక్రియను పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. వేలానికి బెంగళూరును వేదికగా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్‌.. తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా హార్ధిక పాండ్యా, కోచ్‌గా ఆశిష్‌ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంజీవ్‌ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ హెడ్‌ కోచ్‌గా ఆండీ ప్లవర్‌, మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ను నియమించుకుంది. అయితే కెప్టెన్‌ విషయంలో మాత్రం ఈ ఫ్రాంచైజీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ -2022 మెగావేలానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్‌ మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ వెల్లడించారు. అలాగే ఈ ఏడాది కొత్తగా వస్తున్న లక్నో, అహ్మదాబాద్‌ జట్లకు బీసీసీఐ ఫార్మల్‌ క్లియరెన్స్‌ కూడా ఇచ్చిందని ఆయన ప్రకటించారు. ఆయా ఫ్రాంఛైజీలకు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను జారీ చేయాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు బిడ్‌లను గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆవెూదించిందని,దీనికి సంబంధించిన ఎల్‌ఐవోను త్వరలోనే జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను జారీ చేయడం ద్వారా ఐపీఎల్‌ మెగా వేలానికి ముందే ఈ రెండు జట్లు తమ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉందని బ్రిజేష్‌ పటేల్‌ తెలిపారు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌కు కొత్త స్పాన్సర్‌ రానుంది. చైనా కంపెనీ వివోకు బదులు టాటా సంస్థను ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా నియమించింది.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles