Thursday, May 26, 2022

కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభం…

– ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం
– ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో తెలుగు మీడియం
– అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: స్పెషల్ ఆఫీసర్ మధులత

జగిత్యాల, మే 13 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కస్తూర్భాగాంధీ విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ మధులత తెలిపారు. శుక్రవారం ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ తమ విద్యాలయంలో ఆరు నుంచి పదో తరగతులకు ఇంగ్లీష్ మీడియం, ఇంటర్మీడియట్ లో తెలుగు మీడియంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో బోధించనున్నట్లు తెలిపారు. ఆధునిక భవనం, హాస్టల్ వసతి, పోషకాహారం, విశాలమైన ఆట స్థలంతో పాటు అర్హత, అనుభవం గల టీచర్లచే బోధించబడునని పేర్కొన్నారు. వీటితో పాటు ఉచిత ఎంసెట్ కోచింగ్, సీసీ కెమెరాలతో 24 గంటల పర్యవేక్షణ కల్పించబడునని తెలిపారు. ఆసక్తి కల విద్యార్థులు కస్తూర్భాగాంధీ విద్యాలయం బాలికల విద్యాలయంలో సంప్రదించాలని కోరారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles