అ సోసైటీలో అన్ని అక్రమాలే... సూత్రదారులేవరు.? పాత్రదారులేవరు.?... అ సిఈవోపై విచారణ నివేదిక ఏమైంది... 51సీ నోటీసుల సంగతి గాలికి... ఛైర్మన్‌ పాత్ర ఏంత.?... హెచ్‌ఆర్‌ పాలసీ జాబితాలో పేరు కోసమే...

Submitted by SANJEEVAIAH on Thu, 21/03/2024 - 23:06
photo

అ సోసైటీలో అన్ని అక్రమాలే
సూత్రదారులేవరు.? పాత్రదారులేవరు.?
అ సిఈవోపై విచారణ నివేదిక ఏమైంది.
51సీ నోటీసుల సంగతి గాలికి
ఛైర్మన్‌ పాత్ర ఏంత
హెచ్‌ఆర్‌ పాలసీ జాబితాలో పేరు కోసమే.

(నిజామాబాద్‌ ప్రతినిధి `  ప్రజాజ్యోతి ` ఎడ్ల సంజీవ్‌)

అది మాక్లూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్‌). అక్కడ జరిగిన అవినీతి అక్రమాలపై ‘‘దొంగలు ఏవరు.? దోశులు ఏవరు.?’’ అన్నట్లుగా తయారు అయింది. ‘‘దొంగనే దొంగ దొంగ అని అరిచినట్లు’’గా ఉంది. ఒకరు ముప్పై ఏళ్లుగా ఒకే చోట పని చేసిన (ఉద్యోగి) వ్యక్తి. మరోకరు నాలుగేళ్లు పని చేస్తున్న (ప్రజాప్రతినిధి) వ్యక్తి కాగా ఎవరు ఏంత అవినీతికి పాల్పడ్డారు. ఎవరిపై ఏంత దోచుకున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఒకరు స్వచ్చంధంగా పదవికి రాజీనామా చేసారు. మరోకరు అవినీతి ఆరోపణలు ఎదుర్కోని మరోచోటికి బదిలీ చేయబడ్డారు. కాగా ఇప్పటికే సదరు అధికారికి నోటీసులు సైతం జారీ చేసి విచారణ చేసారు. విచారణ పూర్తి అయిన నివేదిక జిల్లా కో ఆపరేటివ్‌ కార్యాలయంలో పెండిరగ్‌లో ఉంది. కానీ కాంట్రాక్టు పద్దతిపై ఒకేచోట పని చేసిన సదరు అధికారికి హెచ్‌ఆర్‌ పాలసీలో ఉద్యోగం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉత్తమ అధికారిని అని చెప్పించుకోవడానికి కొత్త తాతంగానికి తెర లేపారు. ఏందుకంటే ఉద్యోగం నుంచి ఇప్పటి వరకు అంటే అక్కడి నుంచి బదిలీ అయిన వరకు ఒకేచోట పని చేసిన ఘనత. సరిగ్గా సుమారు ఆరు మాసాల క్రితం నిజామాబాద్‌ పిఎసిఎస్‌కు వచ్చి పని చేస్తున్నారు. అంతకు ముందు విచారణ పేరుతో సెలవులో ఉన్నారు. అయితే ఇక్కడ వీరిద్దరిలో అవినీతి అక్రమాలకు పాల్పడిరది ఏవరు.? ఏందుకు ఇప్పుడే ఈ తాతంగాన్ని తెరపైకి తెచ్చారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆ డిసివో చేసింది ఏమిటీ..?

ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న మాజీ డిసివో సింహాచలం మాక్లూర్‌ సోసైటీలో ఏ మేరకు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. అ డిసివోకు మాక్లూర్‌ సోసైటీ ఛైర్మన్‌ లక్ష్మి తనయుడు రంజీత్‌ ఏ మేరకు సహాకరించారు అనేది విచారణలో తెలాల్సి అవసరం ఉంది. కానీ అంతకు ముందే మాక్లూర్‌ సోసైటీ సీఈవోగా ఏళ్ల తరబడి పని చేసిన విష్ణు అలియాస్‌ విష్ణువర్ధన్‌పై వచ్చిన ఆరోపణలు, విచారణ నివేదికలు ఏమయ్యాయి. వాటిపై గతంలో విచారణ చేసిన అధికారులు అ నివేదికలను ఏం చేసారూ అనేది మాజీ డిసివో సింహాచలం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏందుకంటే ఉద్యోగం వదులుకోని వెళ్లాల్సిన సీఈవో సెలవుపై వెళ్లి నిజామాబాద్‌ సోసైటీలో ఏందుకు చేరారు. అంటే అయనపై జరిగిన విచారణ నివేదికలు అన్ని బుట్టదాఖలు అయ్యాయి. లేక డీసీవో సింహాచలం వాటిని మాయం చేసారా అనేది ఇప్పుడు లెక్కలు తెలాల్సి ఉంది. అలాగే ఇలా 51సి విచారణ పూర్తి అయిన తర్వాత వాటిపై చర్యలు లేకుండా ఏలా మరోచోట ఉద్యోగం చేస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. చిక్లీలో బోరువెల్‌ రూ.24 వేలు, కట్టని గోదాంకు కట్టినట్లు లేపిన బిల్లులు రూ.7.58 లక్షలు, 2018`19, 2019`20లో వచ్చిన కోనుగోలు కేంద్రం కమిషన్‌ రూ.9 లక్షలు, ముగ్గురు రైతులు రుణాలు తీసుకొని సోసైటీకి తిరిగి చెల్లించిన రూ.3 లక్షలు ఏందుకు సోసైటీ ఖాతాలో జమ కాలేదు. కానీ చెల్లించినట్లు అ రైతుల వద్దకు రసీదులు ఏలా వచ్చాయి. సోసైటీ కోనుగోలు కేంద్రాల ఖర్చుల నిమిత్తం రూ.25 లక్షలు ఖర్చు చేసానని, అందుకు వడ్డీ రూ.4 లక్షలు అయినట్లు లెక్కలు చూపి రూ.29 లక్షలు నోక్కెసిన లక్షల లెక్కలు ఏందుకు బయటకు రాలేదు. 2014లో చీక్లి, గుంజ్లీ, కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతులు భూమి సేకరణ చేసి గోదాం నిర్మాణాలకు అవకాశం ఇస్తే అక్కడ ఏలాంటి గోదాం నిర్మాణం జరగాక పోయిన రూ.7.50 లక్షలు బిల్లులు ఏవరు లేపారు. లేపిన సోమ్ములు ఎవరేవరు పంచుకున్నారు. ఇకపోతే బంగారం తాకట్టు (డిపాజిట్‌) స్కీమ్‌లో సోసైటీలోని బంగారాన్ని బయట తాకట్టు పెట్టి తక్కువ వడ్డీ డబ్బులు తెచ్చి ఎక్కువ వడ్డీకి అప్పులు ఏలా ఇచ్చారు. సోసైటీ నిబంధనాల మేరకు తాకట్టుకు వచ్చిన బంగారం బయటకు రాకూడదు. కానీ ఇలా బయట పెట్టి సోసైటీ సీఈవో నుంచి జిల్లా స్థాయి వరకు ముఖ్యంగా ఆడిట్‌ అధికారులకు, జిల్లా కార్యాలయం విచారణ అధికారులు ఏంతెంత ముట్టజెప్పారు అనే లెక్కలు తెలాల్సి ఉంది. ఇకపోతే మాక్లూర్‌ మండలంలోని ఓ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయునికి రూ.3 వడ్డీకి రూ.10 లక్షలకు పైగా అప్పు ఇచ్చింది ఏవరు.? ఏందుకు ఇచ్చారు. వారి ద్వారా చేకూరిన ప్రయోజనం ఏమిటీ.? వీటిపై డిసివో సింహాచలం విచారణకు ఆదేశించి 51సీ సెక్షన్‌లో విచారణ చేయించారు. కానీ విచారణ చేసిన అధికారి డిసివోకు ఏం నివేదిక ఇచ్చారు. దానిపై ఇంత వరకు ఏందుకు చర్యలు తీసుకోలేదు అనేది అంతుచిక్కని విషయం. ఈ విషయంలో డిసివో సింహాచలం పాత్ర ఏమిటీ.? నివేదిక ఏక్కడ ఉంది.? రెండేళ్లుగా ఏందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఇప్పుడు కొత్త డిసివో శ్రీనివాస్‌కు సవాల్‌గా మారింది. 

తెరపైకి వచ్చిందిలా..?

సంవత్సరమున్నర తర్వాత ఈ విషయాలు ఏందుకు ఇంత హాట్‌ టాపిక్‌గా మారింది.? అంటే ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఇటీవల మాజీ డిసివో సింహాచలంపై విచారణ చేపట్టేందుకు హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయం నుంచి విచారణ కమిటీ నిజామాబాద్‌ వచ్చింది. ఈ కమిటీలో కీలక పాత్ర పోషించే ఓ అధికారి మెప్పు పొంది హెచ్‌ఆర్‌ పాలసీ జాబితాలో పేరు కోసం మాక్లూర్‌ మాజీ సిఈవో విష్ణు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి మాక్లూర్‌ సోసైటీలో జరిగిన సేక్షన్‌ 51సీ విచారణపై క్లియరెన్స్‌ రావాల్సి ఉంది. దీనిని నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెర లేపారు. అదే సేక్షన్‌ 51సీ విచారణ పూర్తిగా తప్పుల తడక అని, అన్నింటిని డిసివో ఖాతాలో వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. విచిత్ర విషయం ఏమిటంటే... డిసివో సింహాచలం పైనే లెక్కకు మించిన అవినీతి ఆరోపణలు రావడం, వాటిపైనే విచారణ పూర్తి కాకముందే కొందరు సిఈవోలు తమ తప్పులను అటువైపు నెట్టివేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే మాక్లూర్‌ పంచాయతీ సైతం తెర మీదకు రావడం ఇప్పుడు కో ఆపరేటివ్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది. మాక్లూర్‌ సోసైటీ సీఈవో విష్ణుపై వచ్చిన ఆరోపణల విచారణ నివేదిక బయటకు వస్తే కానీ అసలు మాక్లూర్‌ సోసైటీలో ఏం జరిగిందనేది బయట పడనుంది. ఇందుకు ఇందులో దొంగలు ఏవరు.? అవినీతికి పాల్పడిరది ఏవరనే లెక్కలు తెలానున్నాయి. 

తరువాయి భాగంలో...:`
సమావేశాలు ఫూల్‌... సంతకాలు నిల్‌... అసలు దోశులకు శిక్ష పడేనా.? బంగారు వ్యాపారి ‘‘జయసింహా’’ సోసైటీలో ఉన్న బంగారం ఏంత.? ఆధారాలతో మీ ముందుకు..