Thursday, May 26, 2022

57 రాజ్య సభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు

న్యూ ఢిల్లీ –  రాజ్య‌స‌భ‌లో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 57 స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు ఆయా రాజ్య‌స‌భ సీట్ల ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.. రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా 15 రాష్ట్రాల‌కు చెందిన ఈ సీట్ల‌కు జూన్ 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ నెల 24న నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నుంది.ఇక ఖాళీల వివ‌రాల్లోకెళితే… ఏపీలో 4 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో రెండు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏపీలో వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి స‌హా.. బీజేపీ స‌భ్యులుగా ఉన్న సుజ‌నా చౌద‌రి, సురేశ్ ప్ర‌భు, టీజీ వెంక‌టేశ్‌ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. తెలంగాణ‌కు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు, డి. శ్రీనివాస్‌ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈ స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకే కొత్త‌గా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles